News July 10, 2024
ఇడుపులపాయ IIITలో గంజాయి.. లోకేశ్ ఆగ్రహం

AP: వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలంపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. గంజాయిని ప్రోత్సహించే నాయకులపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాలయాల్లో వాటి ఆనవాళ్లు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. గంజాయి నిర్మూలనకు ఇప్పటికే ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని తెలిపారు. IIIT విద్యార్థుల పేరెంట్స్‌ను లోకేశ్ కలిశారు.
Similar News
News January 26, 2026
CCRHలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి(CCRH) 40 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, M.Pharm/MVSc, PG, MLT, PhD, ME/MTech, BE/BTech, NET/GPAT/GATE/RET ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 10, 11, 12, 13, 16, 17, 18, 24, మార్చి10తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్సైట్: ccrhindia.ayush.gov.in
News January 26, 2026
ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలి: సీఎం

AP: పాలనలో టెక్నాలజీని వినియోగించి ఉద్యోగులపై పని భారం తగ్గించాలని CM చంద్రబాబు అధికారులకు సూచించారు. RTGSపై సమీక్షలో ఆయన మాట్లాడారు. 2026ను టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్‌గా మార్చాలన్నారు. ప్రభుత్వ సేవల్లోనూ AI పాత్ర పెరగాలని స్పష్టం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్‌తో 878 సేవలు అందుతున్నాయని, ఇప్పటివరకు 1.43 కోట్ల మంది వినియోగించుకున్నారని అధికారులు సీఎంకు వివరించారు.
News January 26, 2026
ఆపరేషన్ సిందూర్.. పాక్ గాలి తీసిన స్విస్ థింక్ ట్యాంక్!

ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌దే విజయమని స్విస్ థింక్ ట్యాంక్ CHPM తేల్చి చెప్పింది. ప్రారంభంలో పాక్ హడావిడి చేసినా తర్వాత ఇండియన్ ఎయిర్ సుపీరియారిటీ ముందు తలవంచక తప్పలేదని పేర్కొంది. ప్రత్యర్థి ఎయిర్ డిఫెన్స్‌ను మన వాయుసేన పూర్తిగా ధ్వంసం చేసి పాక్ ఎయిర్ బేస్‌లను కోలుకోలేని దెబ్బకొట్టిందని తేల్చింది. భయపడి 4 రోజుల్లోనే పాక్ Ceasefire కోరుకున్నట్లు తెలిపింది. భారత్‌ది బలమైన ప్రతీకారమని పేర్కొంది.


