News July 22, 2024

ఐపీఓలతో మార్కెట్లు ఈ వారమంతా బిజీబిజీ!

image

ఈరోజు నుంచి మొదలై వరుసగా ఏడు ఐపీఓలు, ఓ FPO లాంచ్‌తో ఈ వారం మార్కెట్లలో సందడి నెలకొననుంది. వీటితో మొత్తంగా ₹410కోట్లు సమకూరుతాయని అంచనా. RNFI సర్వీసెస్ IPO (₹98-105/షేర్), SAR టెలీవెంచర్ FPO (₹200-210/షేర్) ఈరోజు లాంచ్ అవుతాయి. రేపు VL ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్, VVIP ఇన్‌ఫ్రాటెక్.. ఈనెల 23-25 మధ్య చేతనా ఎడ్యుకేషన్, మంగళం ఇన్‌ఫ్రా, క్లీనిటెక్ ల్యాబొరేటరీ, అప్రమేయా ఇంజినీరింగ్ IPOలు లాంచ్ కానున్నాయి.

Similar News

News November 9, 2025

పెరుగుతున్న చలి.. వచ్చేవారం మరో అల్పపీడనం

image

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఏపీలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో నిన్న 14.5 డిగ్రీలు, చాలా జిల్లాల్లో 20-25 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు తెలంగాణలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. మరోవైపు వచ్చేవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయన్నారు.

News November 9, 2025

ఆముదపు విత్తులు ముత్యాలవుతాయా?

image

ఒక వస్తువు లేదా వ్యక్తి సహజ స్వభావం ఎప్పటికీ మారదు. ఆముదపు విత్తనాలు ఎప్పటికీ ఆముదపు విత్తనాలుగానే ఉంటాయి, అవి విలువైన ముత్యాలుగా మారవు. అలాగే దుర్మార్గులైన లేదా చెడ్డ స్వభావం కలిగిన వ్యక్తులు వారి ప్రవర్తనను మార్చుకోరని చెప్పడానికి.. సహజంగా జరగని లేదా అసాధ్యమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.

News November 9, 2025

కార్తీకంలో ఏ దానం చేస్తే ఏ ఫలితం?

image

దీప దానం చేస్తే అజ్ఞానం తొలగిపోతుంది.
అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.
వస్త్ర దానం వల్ల శివానుగ్రహం కలుగుతుంది.
స్వయంపాకం దానమిస్తే గౌరవం పెరుగుతుంది.
ఉసిరికాయలు దానం చేస్తే శుభం కలుగుతుంది.
గోదానంతో కృష్ణుడి కృప మీపై ఉంటుంది.
తులసి దానం చేస్తే మోక్షం లభిస్తుంది.
ధన దానం చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.
పండ్లను దానం చేస్తే సంతానం కలుగుతుంది.