News July 15, 2024

లాభాలతో మార్కెట్లు క్లోజ్.. ONGC స్టాక్స్ ఆల్ టైమ్ హై

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 145 పాయింట్ల లాభంతో 80,664 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 24,586 వద్ద స్థిరపడ్డాయి. ఫార్మా, ఆయిల్ & గ్యాస్ రంగాలు రాణించడం మార్కెట్లకు కలిసొచ్చింది. పీఎస్‌యూల్లో ONGC షేర్లు జీవితకాల గరిష్ఠాలను తాకాయి. 2.5% వృద్ధితో షేర్ విలువ ₹314.70కు చేరింది. శ్రీరామ్ ఫైనాన్స్, SBIలైఫ్, బజాజ్ ఆటో, SBI షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి.

Similar News

News January 19, 2026

నాన్న ఎదుట ఏడ్చేవాడిని: హర్షిత్ రాణా

image

తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్ గురించి భారత క్రికెటర్ హర్షిత్ రాణా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘పదేళ్లపాటు నేను ఎంపిక కాలేదు. ట్రయల్స్‌కు వెళ్లడం, నా పేరు ఉండకపోవడం జరిగేది. ఇంటికొచ్చి నాన్న ఎదుట ఏడ్చే వాడిని. ఇప్పుడు ఆ వైఫల్యాలు పోయాయని భావిస్తున్నా. ఏం జరిగినా ఎదుర్కోగలను’ అని చెప్పారు. ఇప్పటిదాకా 14 వన్డేలు ఆడిన హర్షిత్ 26 వికెట్లు పడగొట్టారు. NZతో మూడో వన్డేలో 3 వికెట్లు తీశారు.

News January 19, 2026

విద్యార్థిగా సీఎం రేవంత్

image

TG: యూఎస్ హార్వర్డ్ యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థిగా మారనున్నారు. కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో ‘లీడర్‌షిప్ ఫర్ ది 21st సెంచరీ’ ప్రోగ్రామ్‌కు ఆయన ఈ నెల 25-30 వరకు హాజరవుతారని CMO తెలిపింది. మొత్తం 20దేశాల నుంచి నేతలు ఈ క్లాసులకు హాజరుకానున్నారు. పలు అంశాలపై ఆయన అసైన్‌మెంట్స్‌తోపాటు హోంవర్క్ కూడా చేయనున్నారు. భారత్ నుంచి సీఎం హోదాలో హాజరవుతున్న తొలి వ్యక్తి రేవంతే.

News January 18, 2026

ఎగ్జామ్ లేకుండానే.. నెలకు రూ.12,300 స్టైపండ్

image

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. APలో 11, తెలంగాణలో 17 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక భాషపై పట్టు ఉండాలి. వయసు 20-28 ఏళ్లు. ఏడాది పాటు ట్రైనింగ్ ఉంటుంది. నెలకు రూ.12,300 స్టైపండ్ ఇస్తారు. అప్లికేషన్లకు చివరి తేదీ JAN 25. 12వ తరగతిలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. పూర్తి వివరాల కోసం <>క్లిక్<<>> చేయండి.