News September 10, 2025

లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

image

స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 390 పాయింట్లు లాభపడి 81,489 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు వృద్ధి చెంది 24,990 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. HCL టెక్, TCS, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బెల్, L&T, కొటక్ బ్యాంక్, యాక్సిస్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సన్ ఫార్మా, మారుతీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, ఎటర్నల్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Similar News

News March 15, 2026

ఫింగర్ ప్రింట్‌లాగే టంగ్ ప్రింట్స్.. తెలుసా?

image

ప్రతి మనిషికి వేలిముద్రలు ఎలాగైతే వేర్వేరుగా ఉంటాయో నాలుక ముద్రలు (Tongue prints) కూడా అలాగే ఒకరితో ఒకరికి అస్సలు పోలి ఉండవు. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తుల నాలుక ఆకృతి, ఉపరితల నిర్మాణం ఒకేలా ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కవలల విషయంలోనూ ఇవి భిన్నంగానే ఉంటాయి. ఫ్యూచర్‌లో ఇది అత్యంత నమ్మదగిన బయోమెట్రిక్ గుర్తింపుగా మారే అవకాశం ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో

News March 15, 2026

22న రైతు భరోసా నిధులు

image

TG: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 22వ తేదీ రైతు భరోసా మొదటి విడత నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. సిద్దిపేట(D) నర్మెట్టలో CM రేవంత్ రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు 20రోజుల తర్వాత రెండో విడత, APR నెలాఖరులోగా మూడో విడత నిధులు అందజేయనున్నారు. 3 విడ‌త‌ల్లో క‌లిపి రైతుల ఖాతాల్లో సుమారు రూ.9 వేల కోట్లు జమ కానున్నాయి.

News March 15, 2026

LSGకి బిగ్ షాక్?

image

ఈ నెలాఖరున ప్రారంభమయ్యే IPLలో LSG జట్టుకు కీలక ప్లేయర్ దూరం కానున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా గాయం కారణంతో ఈ సీజన్ ఆడటం అనుమానమే అని అంటున్నాయి. తొడ కండరాల గాయం వల్ల T20WCలోనూ అతను ఆడలేదు. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఈసారి వేలంలో ఇతడిని LSG రూ.2కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత సీజన్లో హసరంగా RR తరఫున ఆడి 11 వికెట్లు తీశారు.