News November 18, 2024

అక్కడ మార్కులుండవ్.. ఎమోజీలే

image

పిల్లలకు పరీక్షలు, మార్కులు, గ్రేడ్ల ప్రస్తావనే లేకుండా కేరళ కొచ్చిలోని CBSE స్కూల్స్ వినూత్న విధానాన్ని అమలుచేస్తున్నాయి. KG నుంచి రెండో తరగతి వరకు విద్యార్థుల సోషల్ స్కిల్స్ పెంచేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో ప్రదర్శన ఆధారంగా వారికి క్లాప్స్, స్టార్, ట్రోఫీ లాంటి ఎమోజీలను కేటాయిస్తున్నాయి. దీనివల్ల విద్యార్థుల్లో ఉత్సాహం కనిపిస్తోందని, ఒత్తిడి అసలే లేదని టీచర్లు చెబుతున్నారు.

Similar News

News November 19, 2024

2019 VS 2024: 7 రెట్లు ఎక్కువ డబ్బు సీజ్ చేసిన ECI

image

తాజా ఎన్నికల సీజన్లో రూ.1000 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేసినట్టు ECI తెలిపింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ కలుపుకొని రూ.858 కోట్లు స్వాధీనం చేసుకున్నామంది. 2019తో పోలిస్తే ఈ విలువ 7 రెట్లు ఎక్కువని తెలిపింది. మహారాష్ట్రలో రూ.660 కోట్లు, ఝార్ఖండ్‌లో రూ.198 కోట్లు, బై పోల్స్ జరిగే రాష్ట్రాల్లో రూ.223 కోట్లమేర సీజ్ చేశామని వెల్లడించింది. NOV 20న తుదిదశ పోలింగ్ ఉండటంతో నిఘా ఇంకా పెంచుతామని పేర్కొంది.

News November 19, 2024

పిల్లలను పెంచేందుకు పెరుగుతోన్న ఖర్చులు

image

దేశంలో పిల్లల పెంపకం ఖర్చు గణనీయంగా పెరుగుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు ముఖ్యంగా ఎదుర్కొంటున్న ఖర్చులు ఇవే. పిల్లల ఆహారానికి ఏడాదికి రూ.35వేలు, బట్టలకు రూ.24 వేలు, ఆరోగ్య సంరక్షణకు రూ.20వేలు, విద్యకు రూ. 5వేల నుంచి రూ.లక్ష, డిగ్రీ చదివే పిల్లలుంటే రూ.5లక్షల వరకు, ఆటవస్తువులు & ఇతర అవసరాలకు రూ.25వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఖర్చులు ఏటా పెరుగుతూనే ఉంటాయి.

News November 19, 2024

వరంగల్‌కు వరాల జల్లు (1/2)

image

ప్రజాపాలన విజయోత్సవ వేడుకల వేళ ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాపై వరాల జల్లు కురిపించింది.
* వరంగల్ మహానగర అభివృద్ధికి రూ.4962.47కోట్లు
* వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.4,170కోట్లు
* కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు రూ.160.92కోట్లు
* టెక్స్‌టైల్ పార్కులో రోడ్లు, స్కూల్స్, సదుపాయాలకు రూ.33.60కోట్లు
* పార్క్‌కు భూములిచ్చిన రైతులకు 863ఇళ్లు, రూ.43.15 కోట్ల పరిహారం