News March 21, 2024

ఎన్నికల కోసం 60 ఏళ్లకు పెళ్లి

image

బిహార్‌లో అశోక్ మహతో(60) అనే గ్యాంగ్‌స్టర్ ఓ హత్య కేసులో 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి గత ఏడాదే రిలీజ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆర్జేడీ తరఫున ముంగేర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకోగా, చట్టపరంగా సాధ్యం కాలేదు. దీంతో పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సూచన మేరకు లేటు వయసులో అనితా కుమారి(44) అనే మహిళను గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆమెను ఎన్నికల బరిలో నిలపనున్నారు.

Similar News

News January 17, 2026

ఈ రైతు వ్యవసాయం ప్రత్యేకం.. రోజూ ఆదాయం

image

15 ఏళ్లుగా సమీకృత సేద్యం చేస్తూ అద్భుత విజయాలు అందుకుంటున్నారు జగిత్యాల(D)మెట్లచిట్టాపూర్‌కు చెందిన భూమేశ్వర్. 8 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి, మొక్కజొన్న, కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తూ.. డెయిరీఫామ్, నాటు కోళ్లు, చేపలను కూడా పెంచుతున్నారు. పాలు, కూరగాయలు, ఆర్గానిక్ రైస్, కోళ్లు, చేపలు అమ్మి రోజూ ఆదాయం పొందుతున్నారు. ఈ రైతు సక్సెస్ స్టోరీ తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.

News January 17, 2026

ఇతిహాసాలు క్విజ్ – 126

image

ఈరోజు ప్రశ్న: రావణుడు చనిపోతున్నప్పుడు లక్ష్మణుడు అతని దగ్గరకు వెళ్లి ఏం నేర్చుకున్నాడు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 17, 2026

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో పోస్టులు

image

ఢిల్లీలోని <>డిజిటల్<<>> ఇండియా కార్పొరేషన్ 9 టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గలవారు జనవరి 26వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/ B.Tech/ MCA, డిగ్రీ(CS/IT) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://dic.gov.in