News May 25, 2024
వరకట్నం వివరాలు చెబితేనే మ్యారేజ్ సర్టిఫికెట్
యూపీలో వివాహ ధ్రువీకరణ పత్రం (మ్యారేజ్ సర్టిఫికెట్) కోసం అక్కడి సర్కార్ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇక నుంచి వరకట్నం వివరాలు కూడా సమర్పిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపింది. యూపీలో మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం ఇప్పటివరకు పెళ్లి కార్డు, ఆధార్ కార్డు, హైస్కూల్ మార్క్ షీట్ సమర్పించాల్సి ఉండేది. తాజాగా వరకట్నం అఫిడవిట్లో ఎంత కట్నం తీసుకున్నారో వెల్లడించాల్సి ఉంటుంది.
Similar News
News January 16, 2025
PHOTO: చంద్రబాబుతో నితీశ్ కుమార్ రెడ్డి
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా నితీశ్‌కు సీఎం రూ.25 లక్షల చెక్కును అందజేశారు. అంతర్జాతీయ గడ్డపై చరిత్ర సృష్టించి తెలుగువారు గర్వపడేలా చేశాడని చంద్రబాబు కొనియాడారు. భవిష్యత్తులో మరింత రాణించాలని ఆకాంక్షించారు. నితీశ్ వెంట ఆయన తండ్రితో పాటు ACA అధ్యక్షుడు ఉన్నారు.
News January 16, 2025
సంక్రాంతి.. APSRTCకి భారీ ఆదాయం
AP: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపిన ఏపీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం వచ్చింది. జనవరి 8 నుంచి 16 వరకు 3,400 సర్వీసులను తిప్పగా రూ.12 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది.. ఈ నెల 20 వరకు మరో 3,800 బస్సులను నడపనుండగా రూ.12.5 కోట్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పండుగ సీజన్లో దాదాపు 4 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు చెబుతున్నారు.
News January 16, 2025
సైఫ్ అలీఖాన్‌పై దాడి.. సంచలన విషయాలు
హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడికి యత్నించిన నిందితుడు తొలుత అతడి కొడుకు జేహ్(4) బెడ్రూమ్లోకి ప్రవేశించినట్లు పోలీసులు FIR కాపీలో తెలిపారు. ‘బాబు సంరక్షణ కోసం ఉన్న నర్సు నిందితుడిని నిలువరించింది. దీంతో అతడు ఆమెపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. అలికిడి విని సైఫ్, కరీనా ఆ గదిలోకి వెళ్లారు. పెనుగులాటలో దుండగుడు సైఫ్‌ను కత్తితో పొడిచి పారిపోయాడు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం సైఫ్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.