News November 20, 2024
ఉదయం పెళ్లి.. మధ్యాహ్నం హత్య..!
TG: మియాపూర్ బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 8న ఉదయం బాలికను నిందితుడు చింటూ తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. తన ఫ్రెండ్, అతని భార్య బయటికెళ్లడంతో మధ్యాహ్నమే ఆమెను చంపేశాడు. ఆపై మీ కుమార్తె కనిపించడం లేదంటూ బాలిక పేరెంట్స్కు ఫోన్ చేసి చెప్పాడు. పదే పదే పలువురికి వాట్సాప్ కాల్ చేసినట్లు తేలడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేశారు.
Similar News
News November 27, 2024
అప్పుడు YSR, KCR, ఇప్పుడు రేవంత్: కిషన్రెడ్డి
TG: పార్టీ ఫిరాయింపుల విషయంలో BRS, కాంగ్రెస్ ఒకటేనని కేంద్రమంత్రి కిషన్రెడ్డి మీడియాతో అన్నారు. అప్పుడు YSR, KCR, ఇప్పుడు రేవంత్ పార్టీ ఫిరాయింపులు చేయిస్తున్నారన్నారు. ఫిరాయింపు MLAలపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పినా స్పీకర్ స్పందించడం లేదన్నారు. అటు ఫుడ్పాయిజన్తో ఓ చిన్నారి చనిపోతే CM రేవంత్ కనీసం దృష్టి పెట్టలేదని అన్నారు. 4-5 నెలలుగా విద్యార్థులు అవస్థలు పడుతున్నారని చెప్పుకొచ్చారు.
News November 27, 2024
జగన్ ముడుపుల వ్యవహారంపై విచారించండి: షర్మిల
AP: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను APCC చీఫ్ షర్మిల కలిశారు. అదానీ, జగన్ మధ్య ముడుపుల వివాదంపై దర్యాప్తు చేపట్టాలని గవర్నర్ను ఆమె కోరారు. వెంటనే దర్యాప్తు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమె గవర్నర్కు విజ్ఞప్తి చేశారు.
News November 27, 2024
సైడైపోయిన శిండే.. మహారాష్ట్ర CM అయ్యేదెవరో?
మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. PM మోదీ ఎవరిని నియమించినా ఫర్వాలేదని స్వయంగా చెప్పడంతో పోటీలో ఏక్నాథ్ <<14724983>>శిండే<<>> లేరన్న సంకేతాలు వచ్చాయి. అజిత్ పవార్ (NCP) ఆ సమీకరణాల్లోనే లేరు. ఇక మిగిలింది దేవేంద్ర ఫడణవీస్. అయితే ఆయనే CM. లేదంటే కొత్త ముఖాన్ని చూడటం పక్కా. హరియాణా, ఛత్తీస్గఢ్, ఒడిశా, RJ, MP CMల ఎంపికను గమనిస్తే BJP కొత్త నాయకత్వానికి పెద్దపీట వేయడం అర్థమవుతోంది.