News October 12, 2025
అనుబంధాల ఆలయమే పెళ్లి

పెళ్లంటే నూరేళ్ల పంట మాత్రమే కాదు. ఏడడుగుల అనుబంధం. ఏడు జన్మల అనురాగం. ఇది రెండు మనసుల పవిత్ర కలయిక. ఇరువురి జీవితాల ప్రేమానురాగాల అల్లిక. తల్లిదండ్రులను మురిపించి, రెండు కుటుంబాల సంతృప్తిని కొనసాగించే గొప్ప సంస్కారం. శాంతి సౌభాగ్యాల ఉద్భవానికి, ‘నా’ అనే తీయని భావనతో కుటుంబాన్ని ఏర్పాటుచేసుకొనే మొదటి సోపానం. ఓర్పు, సహనం అనే పునాదులపై నిర్మితమయ్యే అందమైన అనుబంధాల సౌధమే వివాహం. <<-se>>#Pendli<<>>
Similar News
News October 12, 2025
368 ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

దేశంలోని అన్ని రైల్వే జోన్లలో 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ( OCT 14)ఆఖరు తేదీ. డిగ్రీ పాసై, 20-33 ఏళ్ల వయసున్న అభ్యర్థులు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, మహిళలు, దివ్యాంగులకు రూ.250. ఆన్‌లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in/
News October 12, 2025
ట్రంప్ టారిఫ్స్.. చైనా స్ట్రాంగ్ వార్నింగ్

చైనా దిగుమతులపై NOV 1 నుంచి అదనంగా 100% టారిఫ్స్ విధిస్తున్నట్లు US అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై చైనా దీటుగా స్పందించింది. ‘USవి ద్వంద్వ ప్రమాణాలు. ఈ చర్యలు మా దేశ ప్రయోజనాలకు తీవ్ర హాని చేస్తాయి. ఆర్థిక, వాణిజ్య చర్చలకు విఘాతం కలిగిస్తాయి. మేం ఫైట్ చేయాలని అనుకోవడం లేదు. అలాగని గొడవకు భయపడం’ అని చైనా కామర్స్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. చర్యకు ప్రతి చర్య ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
News October 12, 2025
తిరుమలలో పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లు నిండిపోయి భక్తుల క్యూ లైన్ శిలాతోరణం వరకు దాటిపోయింది. నిన్న 84,571 మంది స్వామివారిని దర్శించుకున్నారు. కానుకల రూపంలో ₹3.70 కోట్లు సమర్పించారు. 36,711 మంది తలనీలాలు అర్పించారు. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు దర్శనానికి 20 గంటలు పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారు కేటాయించిన సమయానికి మాత్రమే క్యూలోకి రావాలని టీటీడీ సూచించింది.