News March 15, 2025

గిరిజనేతర మహిళతో పెళ్లి.. మాజీ ఎంపీకి షాక్!

image

ఒడిశాలోని బీజేడీ నేత, మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీకి షాక్ తగిలింది. గిరిజనేతర అగ్రకుల మహిళను ఆయన పెళ్లి చేసుకోవడాన్ని నేరంగా పరిగణించిన ఆయన తెగ ‘భటారా సమాజ్‌’ ప్రదీప్‌ను వెలివేస్తున్నట్లు ప్రకటించింది. తమ సమావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. తెగ నిబంధనల్ని ఆయన ఉల్లంఘించారని, అందుకే వెలివేయాల్సి వస్తోందని వివరించింది. ప్రదీప్ 2009లో కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు.

Similar News

News March 9, 2026

కాబోయే భార్యతో బెల్లంకొండ.. ఎమోషనల్ ట్వీట్

image

కావ్య రెడ్డితో త్వరలోనే పెళ్లి జరగనున్నట్లు టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రకటించారు. <<19329203>>నిన్న<<>> జరిగింది అనౌన్స్‌మెంట్ మాత్రమేనని, త్వరలో పెళ్లికి సంబంధించిన డేట్స్ వెల్లడిస్తామని ట్వీట్ చేశారు. ‘నా జీవితంలోకి వచ్చి ఎనలేని సంతోషాన్ని ఇచ్చినందుకు కావ్యకు థాంక్స్. నీ ముఖంలోని చిరునవ్వు ఎప్పటికీ మాయమవకుండా చూసుకుంటాం. మనం ఒక్కటయ్యే రోజు కోసం ఎదురుచూస్తున్నా’ అని ఆయన ఎమోషనల్ అయ్యారు.

News March 9, 2026

ఇరాన్ చరిత్రలో గొప్ప ప్రధాని.. బ్రిటన్, అమెరికా కుట్రలతో..

image

మొహమ్మద్ మొస్సాదేగ్ 1951-53 వరకు ఇరాన్ ప్రధానిగా ఉన్నారు. విద్యావంతుడైన ఈయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యారు. తమ క్రూడాయిల్‌పై బ్రిటన్ ఆధిపత్యం ఉండొద్దని జాతీయం చేశారు. దీంతో ఇరాన్ రాజు మొహమ్మద్ రెజా బ్రిటన్, అమెరికాలతో కలిసి.. ఆయన కమ్యూనిజం వైపు వెళ్తున్నారని, రాజద్రోహానికి పాల్పడ్డారని కుట్రలు మోపారు. దీంతో మొస్సాదేగ్ మూడేళ్లు జైలు జీవితం గడిపారు. మరణించే వరకు (1967) గృహనిర్బంధంలోనే ఉన్నారు.

News March 9, 2026

CECపై అవిశ్వాస తీర్మానం?

image

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌పై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టాలని విపక్షాలు యోచిస్తున్నాయి. ఈ వారంలోనే నోటీసు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అవిశ్వాస తీర్మానాన్ని టీఎంసీ ప్రతిపాదించగా INDIA బ్లాక్ ఎంపీలు అంగీకరించినట్లు సమాచారం. కాగా SIR వివాదాలు, సీఈసీ బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని విపక్షాలు చాలా కాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.