News July 14, 2024

పెళ్లి.. యమా కాస్ట్లీ గురూ!

image

మన దేశంలో పెళ్లి ఖర్చు విషయంలో ఎవరూ తగ్గడం లేదు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ఎక్కువగా వెచ్చిస్తున్నారు. పేదలు-రూ.3 లక్షలు, దిగువ మధ్య తరగతి-రూ.6 లక్షలు, మధ్య తరగతి-రూ.10-25 లక్షలు, కోటీశ్వరులు-రూ.50 లక్షలు, సంపన్నులు-రూ.కోటిపైన ఖర్చు చేస్తున్నారు. మనదేశంలో చదువు కన్నా పెళ్లికే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. చదువు కోసం సగటున రూ.3.3 లక్షలు వెచ్చిస్తుండగా వివాహానికి రూ.12.5 లక్షలు వెచ్చిస్తున్నారు.

Similar News

News November 7, 2025

WGL: రోజురోజుకు తగ్గుతున్న పత్తి ధరలు

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు అన్నదాతలను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. రోజురోజుకు ధరలు తగ్గుతూ కంటతడి పెట్టిస్తున్నాయి. క్వింటా పత్తి ధర సోమవారం రూ.6,920, మంగళవారం రూ.6,950, గురువారం రూ.6,900 పలికాయి. నేడు మరింత పతనమై రూ.6,860కి చేరింది. ధరలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు.

News November 7, 2025

264 పోలీస్ ఉద్యోగాల భర్తీకి అనుమతి

image

AP: నిరుద్యోగులకు శుభవార్త. ఏపీఎస్పీలో 19 SI, 245 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026-27లో 10 SI, 125 కానిస్టేబుల్, 2027-28లో 9 SI, 120 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని పేర్కొంది. ఈ మేరకు పోలీసు నియామక మండలికి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. దీంతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

News November 7, 2025

ఏటా 5-10% పెరగనున్న ఇళ్ల ధరలు

image

ప్రస్తుతం దేశంలో ఏటా ఇళ్ల అమ్మకాలు 3-4L యూనిట్లుగా ఉండగా 2047 నాటికి రెట్టింపవుతాయని CII, కొలియర్స్ ఇండియా అంచనా వేశాయి. భారీ డిమాండ్ వల్ల 2 దశాబ్దాలపాటు ఏటా 5-10% మేర గృహాల రేట్లు పెరుగుతాయని పేర్కొన్నాయి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ $0.3 ట్రిలియన్లుగా ఉండగా 2047కు $5-10 ట్రిలియన్లకు పెరగొచ్చని తెలిపాయి. మౌలిక వసతులు, రవాణా, వరల్డ్ క్లాస్ నిర్మాణాలు ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డాయి.