News April 12, 2024

డబ్బు, ఫేమ్ కోసమే బాలీవుడ్‌లో పెళ్లిళ్లు: నోరా

image

బాలీవుడ్‌లో చాలామంది డబ్బు, ఫేమ్ కోసమే పెళ్లి చేసుకుంటున్నారని హీరోయిన్ నోరా ఫతేహి అన్నారు. ‘ప్రేమించినట్లు నటించి డబ్బు, పేరు కోసం వారు తాపత్రయపడుతున్నారు. ఏళ్ల తరబడి వారితోనే జీవిస్తూ జీవితం నాశనం చేసుకుంటున్నారు. వారి కెరీర్ ఎక్కడికెళ్తుందో తెలియదు. తమ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి డిప్రెషన్‌లో జీవిస్తున్నారు. వారు ఎందుకు అలా చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు’ అని ఆమె పేర్కొన్నారు.

Similar News

News February 8, 2026

సెట్‌లో తాగుబోతును చితకబాదా: సాయి ధన్సిక

image

తాను నటించిన ‘యోగిడా’ మూవీ సెట్‌లో ఓ వ్యక్తిని చితకబాదినట్లు హీరోయిన్ సాయి ధన్సిక తెలిపారు. ‘కేరళలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఫొటో దిగేందుకు వచ్చాడు. అతడు తాగి ఉండటంతో ఫొటో ఇచ్చేందుకు నా అంకుల్ ఒప్పుకోలేదు. దీంతో అంకుల్‌ని కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అది చూసి కోపంలో పరిగెత్తుకుంటూ వెళ్లి అతడిని చితకబాదా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హీరో విశాల్‌తో ఈ బ్యూటీ ఎంగేజ్మెంట్ జరిగింది.

News February 8, 2026

ఫిబ్రవరి 8: చరిత్రలో ఈరోజు

image

✒ 1897: మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జననం(ఫొటోలో) ✒ 1902: సుప్రసిద్ధ కవి ఆండ్ర శేషగిరిరావు జననం ✒ 1934: ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వర రావు జననం ✒ 1941: గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జననం ✒ 1957: నటి వై.విజయ జననం ✒ 1963: IND మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జననం

News February 8, 2026

చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా

image

యూఎస్ఏపై విజయంతో టీమ్ ఇండియా T20IWCలో వరుసగా అత్యధిక మ్యాచులు గెలిచిన జట్టుగా నిలిచింది. 2024 నుంచి ఇప్పటివరకు వరుసగా 9 మ్యాచులు గెలిచింది. దీంతో సౌతాఫ్రికా(2024లో 8విజయాలు)ను దాటేసింది. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా(8wins) ఉంది. అటు WCలో వన్డే, టీ20ల్లో కలిపి ఓవరాల్‌గా టీమ్ ఇండియా 100 విజయాలు పూర్తి చేసుకుంది. ఆస్ట్రేలియా(108) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో టీమ్ కావడం గమనార్హం.