News June 29, 2024

పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్

image

‘జై బోలో తెలంగాణ’ ఫేమ్ మీరా నందన్ తన ప్రియుడు శ్రీజును పెళ్లి చేసుకున్నారు. కేరళలోని గురువాయూర్ ఆలయంలో ఇవాళ ఈ వేడుక జరిగింది. 2008లో ముల్లా సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో దాదాపు 40 చిత్రాల్లో నటించారు. తెలుగులో హితుడు, ఫోర్త్ డిగ్రీ తదితర సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్‌గానూ రాణించారు.

Similar News

News January 16, 2026

ఈ సినిమాలన్నీ NETFLIXలోనే

image

షూటింగ్‌ దశలో ఉన్న పలు టాలీవుడ్ చిత్రాల డిజిటల్ రైట్స్ తామే సొంతం చేసుకున్నట్లు NETFLIX ట్వీట్ చేసింది. ఈ జాబితాలో రామ్ చరణ్ ‘పెద్ది’, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, నాని ‘ప్యారడైజ్’, వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’, దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’, శర్వానంద్ ‘బైకర్’, విజయ్ దేవరకొండ ‘VD 14’, విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ఉన్నాయి. ఈ చిత్రాలు థియేటర్లలో విడుదలై 4-8 వారాల్లో OTTలోకి వచ్చే అవకాశముంది.

News January 16, 2026

ఆదివారం పనిచేయనున్న స్టాక్ మార్కెట్లు

image

ఫిబ్రవరి 1న స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయని దేశీయ ప్రధాన స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లు BSE, NSE ప్రకటించాయి. ఆరోజు ఆదివారం అయినప్పటికీ.. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. టైమింగ్స్‌(9:15 am-3:30 pm)లోనూ ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశాయి. దేశ చరిత్రలో బహుశా ఇలా ఆదివారం మార్కెట్లు పనిచేయడం ఇదే తొలిసారి అయి ఉండొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

News January 16, 2026

రోహిత్‌ కెప్టెన్సీకి గంభీర్ చెక్.. మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు!

image

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తీసేయడం వెనుక కోచ్ గంభీర్ హస్తం ఉండొచ్చని మనోజ్ తివారీ అనుమానం వ్యక్తం చేశారు. అగార్కర్ కోచ్ ప్రభావానికి లోనై ఉండొచ్చేమోనని, రోహిత్ లాంటి లెజెండ్‌ను పక్కన పెట్టడం క్రీడా ధర్మానికి విరుద్ధమన్నారు. 2027 వరల్డ్ కప్ ఆడగల సత్తా ఉన్న హిట్‌మ్యాన్‌ను కాదని గిల్‌కు బాధ్యతలు ఇవ్వడంలో లాజిక్ లేదన్నారు. ఇది రోహిత్‌ను అవమానించడమేనని ఫైర్ అయ్యారు.