News April 24, 2024

ఐపీఎల్ నుంచి మార్ష్ అవుట్

image

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్ స్టార్ ఆల్ రౌండర్ మిచెల్‌ మార్ష్‌ ఐపీఎల్ సీజన్-17 మొత్తానికి దూరమయ్యారు. తొడ కండరాల గాయానికి చికిత్స కోసం అతడు కొన్ని రోజుల క్రితమే ఆస్ట్రేలియాకు వెళ్లారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. మార్ష్‌ ఈ ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈ నెల 3న చివరి మ్యాచ్‌ ఆడారు.

Similar News

News February 5, 2025

మేడారంలో ఇవాళ్టి నుంచి శుద్ధి కార్యక్రమాలు

image

TG: ములుగు(D) తాడ్వాయి(మ) మేడారం మినీ జాతరకు సిద్ధమవుతోంది. ఇవాళ్టి నుంచి సమ్మక్క-సారలమ్మకు పూజలు ప్రారంభం కానున్నాయి. కన్నెపల్లిలో సారలమ్మ, మేడారంలోని సమ్మక్క ఆలయాల్లో అర్చకులు శుద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయాల్లోని పూజా సామగ్రిని శుద్ధి చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. దేవతల పీటలను శుభ్రం చేసి, ముగ్గులతో సుందరంగా అలంకరిస్తారు. ఈ నెల 12 నుంచి 15 వరకు మినీ జాతర వేడుకలు నిర్వహిస్తారు.

News February 5, 2025

ఉమ్మితే భారీ జరిమానా.. బెంగాల్ యోచన

image

పొగాకు, పాన్ మసాలా నమిలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడం పశ్చిమ బెంగాల్‌లోని ప్రధాన సమస్యల్లో ఒకటి. దీన్ని అడ్డుకునేందుకు ఆ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకోనుంది. బహిరంగప్రాంతాల్లో ఉమ్మేవారిపై అత్యంత భారీగా జరిమానాలు విధించేలా ఓ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఇలాంటి చట్టం ఉన్నప్పటికీ భారీ మార్పులు, జరిమానాతో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

News February 5, 2025

గురువారం చోరీలు, వీకెండ్‌లో జల్సాలు

image

TG: గచ్చిబౌలి <<15340404>>కాల్పుల కేసులో<<>> అరెస్టయిన బత్తుల ప్రభాకర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘సరిపోదా శనివారం’లో నాని ఓ రోజు కోపాన్ని ప్రదర్శించినట్లుగా ప్రభాకర్‌కూ ఓ స్టైల్ ఉంది. వారంలో 3రోజులు ప్లానింగ్, గురువారం చోరీ, వీకెండ్‌లో జల్సాలు చేస్తాడు. ₹10L దొరుకుతాయనుకుంటే రంగంలోకి దిగుతాడు. జీవితంలో ₹335Cr కొట్టేయాలని, 100మంది అమ్మాయిలతో గడపాలనేది ఇతని లక్ష్యమని పోలీసుల విచారణలో వెల్లడైంది.

error: Content is protected !!