News September 27, 2025

మార్కెట్ వాల్యూలో ప్రపంచంలోనే టాప్-10లో మారుతీ

image

మార్కెట్ వాల్యూలో ప్రపంచ టాప్-10 వాహన తయారీ సంస్థల్లో ఒకటిగా మారుతీ సుజుకీ ఇండియా నిలిచింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ 57.6 బిలియన్ డాలర్లకు చేరినట్లు పేర్కొంది. ఈ క్రమంలో ఫోర్డ్, జనరల్ మోటార్స్, ఫోక్స్ వ్యాగన్ వంటి సంస్థలను వెనక్కి నెట్టింది. GST సంస్కరణతో కార్ల అమ్మకాలు పెరగడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ జాబితాలో మారుతీ కంటే ముందు టెస్లా, టయోటా, బీవైడీ, ఫెరారీ, BMW, మెర్సిడెస్ బెంజ్ ఉన్నాయి.

Similar News

News February 10, 2026

లావున్నారా? ఈ డిసీజెస్‌తో మరణ ముప్పు 70% అధికం!

image

ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ వల్ల హాస్పిటలైజ్ కావడం లేదా చనిపోయే ప్రమాదం ఒబెసిటీ ఉన్నవాళ్లలో ఎక్కువట. కొవిడ్, ఫ్లూ, నిమోనియా వంటి వ్యాధుల వల్ల ఈ ముప్పు 70% అధికమని లాన్సెట్‌లో స్టడీ తేల్చింది. అధ్యయనంలో భాగంగా 5.40 లక్షల మందిని 13-14 ఏళ్ల పాటు స్టడీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఒబెసిటీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్‌తో మరణించే ప్రమాదమూ పెరిగే ఛాన్స్ ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

News February 10, 2026

ఓ అధికారి తలుచుకుంటే వచ్చే మార్పు ఇదే!

image

తీవ్రమైన చలిలో పిల్లలు చెప్పులు లేకుండా నడుస్తూ స్కూలుకు వెళ్లడం చూసి IAS జితేంద్ర కుమార్ సోనీ మనసు తల్లడిల్లింది. అప్పటికప్పుడు ‘చరణ్ పాదుక అభియాన్’ ప్రారంభించి 15 రోజుల్లోనే దాతల సాయంతో వేలమందికి పాదరక్షలు అందించారు. ఇది రాజస్థాన్ మొత్తం వ్యాపించగా.. ఇప్పటివరకు 1.5 లక్షల మంది పిల్లలు ఉచితంగా పాదరక్షలు పొందారు. ఒక అధికారిలోని మానవత్వం, చిత్తశుద్ధి కలిస్తే సమాజంలో వచ్చే మార్పునకు ఈ ఘటనే నిదర్శనం.

News February 10, 2026

స్పీకర్‌కు కాంగ్రెస్, BJP పోటాపోటీ లేఖలు!

image

ప్రతిపక్షాల నిరసనలతో ఊహించని పరిస్థితి ఎదురుకావచ్చని, <<19058377>>లోక్‌సభకు రావద్దని<<>> మోదీకి చెప్పానని స్పీకర్ ఓంబిర్లా వ్యాఖ్యానించడం తెలిసిందే. దీంతో తమ పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ మహిళా MPలు స్పీకర్‌కు లేఖ రాశారు. దీనికి కౌంటర్‌గా లెటర్ రాసిన BJP మహిళా MPలు.. ఆ రోజు గందరగోళం సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సభ గౌరవాన్ని నిలబెట్టేందుకు సహనం ప్రదర్శించారని ఆయన్ను కొనియాడారు.