News September 19, 2025
కార్ల ధరలు తగ్గించిన మారుతి సుజుకీ

కొత్త GST రేట్ల నేపథ్యంలో మారుతి సుజుకి కార్ల ధరలను తగ్గించింది. S-ప్రెసోపై రూ.1,29,600, ఆల్టో K10పై రూ.1,07,600, సెలేరియోపై రూ.94,100, డిజైర్‌పై రూ.87,700, వ్యాగన్-Rపై రూ.79,600, ఇగ్నిస్‌పై రూ.71,300, స్విఫ్ట్‌పై రూ.84,600, బాలెనోపై రూ.86,100, ఫ్రాంక్స్‌పై రూ.1,12,600, బ్రెజ్జాపై రూ.1,12,700, గ్రాండ్ విటారాపై రూ.1,07,000, జిమ్నీపై రూ.51,900, ఎర్టిగాపై రూ.46,400 మేర ధరలు తగ్గించింది.
Similar News
News January 29, 2026
ఆటోబయోగ్రఫీ రాస్తున్న సూపర్ స్టార్!

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆటో బయోగ్రఫీని రాస్తున్నారని ఆయన కూతురు సౌందర్య వెల్లడించారు. ఈ బుక్ విడుదలయ్యాక గ్లోబల్ సెన్సేషన్ అవుతుందన్నారు. షూటింగ్ టైమ్‌లోనూ ఆయన గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ బుక్‌లో రాసుకునేవారని ‘కూలీ’ డైరెక్టర్ లోకేశ్ ఓ సందర్భంలో చెప్పారు. కాగా కండక్టర్ నుంచి సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన రజినీ జీవితంలో ఎవరికీ తెలియని విషయాలు ఈ ఆటోబయోగ్రఫీ ద్వారా వెల్లడయ్యే ఛాన్సుంది.
News January 29, 2026
ఉపవాసం ఉన్నరోజు పులిహోర ప్రసాదం తినవచ్చా?

సాధారణంగా దేవుడి ప్రసాదం విడవకూడదంటారు. కానీ ఏకాదశి నాడు ధాన్యంతో (పులిహోర, దద్దోజనం వంటివి) చేసిన ప్రసాదాన్ని తినకూడదట. దానిని కళ్లకు అద్దుకుని భద్రపరచాలి అంటున్నారు పండితులు. మరుసటి రోజు, ద్వాదశి నాడు స్వీకరించాలట. ఉపవాస నియమం ప్రకారం.. బియ్యంతో చేసిన ఏ పదార్థమైనా ఆ రోజు తీసుకోకూడదు. పండ్లు, పంచామృతం వంటివి ప్రసాదంగా ఇస్తే తక్కువ మొత్తంలో తీసుకోవచ్చు. అయితే ఈ నియమం ఏకాదశి ఉపవాసానికి మాత్రమే!
News January 29, 2026
ఏకాదశి రోజున ఏం చేయాలంటే..?

5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలతో పాటు మన మనసును అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి. ఈ పవిత్ర దినాన శ్రీమహావిష్ణువును పూజించాలి. లక్ష్మీదేవిని కొలుస్తే సిరి సంపదలు సొంతమవుతాయని నమ్మకం. కుదిరితే జాగారణ చేయాలని పండితులు సూచిస్తున్నారు. శక్తి కొలది పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా తులసి దళాలతో స్వామిని పూజించడం, నెయ్యి దీపం వెలిగించడం అత్యంత శుభకరం.


