News September 20, 2024

ఓటీటీలోకి ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’

image

రావు రమేశ్, ఇంద్రజ, అంకిత్, రమ్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. సుకుమార్ సతీమణి తబిత నిర్మించిన ఈ సినిమాకు లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించగా, కళ్యాణ్ నాయక్ సంగీతం అందించారు. ఆగస్టు 23న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Similar News

News January 10, 2026

ఎట్టకేలకు పూర్తిగా తగ్గిన బ్లోఅవుట్ మంటలు

image

AP: కోనసీమ జిల్లా ఇరుసుమండ బ్లోఅవుట్ వద్ద ఎట్టకేలకు మంటలు తగ్గిపోయాయి. ఈ నెల 5న గ్యాస్ లీకై భారీగా మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వాటర్ అంబ్రెల్లా ద్వారా మంటలను ఆర్పేందుకు ONGC సిబ్బంది తీవ్రంగా కృషి చేశారు. 5 రోజుల తర్వాత పూర్తిగా తగ్గాయి. దీంతో వెల్ క్యాపింగ్ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

News January 10, 2026

SHOCKING: ఆన్‌లైన్‌లో ‘రాజాసాబ్’ HD ప్రింట్

image

డార్లింగ్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే టికెట్ హైక్స్ విషయంలో ప్రభుత్వ మెమోను TG హైకోర్టు కొట్టివేయగా తాజాగా ఈ చిత్ర HD ప్రింట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. కేటుగాళ్లు ఈ చిత్రాన్ని పైరసీ చేసి ఆన్‌లైన్ సైట్‌లో అప్లోడ్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ X వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా పైరసీ చేయడం నేరమంటూ మండిపడుతున్నారు.

News January 10, 2026

పత్తి కట్టెతో సేంద్రియ ఎరువు తయారీ ఎలా?

image

పత్తి ఏరిన తర్వాత కట్టెలను ట్రాక్టర్‌తో నడిచే ష్రెడ్డర్ యంత్రంతో ముక్కలుగా చేయవచ్చు. తర్వాత రెక్క నాగలితో లోతు దుక్కి చేయాలి. ఈ వ్యర్థాలను తొందరగా కుళ్లించే సూక్ష్మజీవుల కల్చర్‌ను, ట్రైకోడెర్మ జీవ శిలీంధ్రనాశినిని పశువుల ఎరువుతో కలిపి నేలపై చల్లి రోటవేటర్‌తో దున్ని చదును చేయాలి. పత్తి కట్టె వ్యర్థాలను ముడి పదార్థాలుగా వాడుకొని కంపోస్ట్ లేదా వర్మికంపోస్టు విధానంలో సేంద్రియ ఎరువు తయారు చేయవచ్చు.