News September 13, 2024
20న ఓటీటీలోకి ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’

రావు రమేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఈ నెల 20 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మధ్యతరగతికి చెందిన ఓ నిరుద్యోగి కష్టాల చుట్టూ సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో ఇంద్రజ, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరించారు.
Similar News
News March 7, 2026
హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటు చేయనుంది. 30వేల చ.అడుగుల ఈ ఆఫీస్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఈ నెల 12న ప్రారంభించనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు ఇప్పటికే ముంబైలో కార్యాలయం ఉండగా భారత్‌లో ఇది రెండోది కానుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ రాకతో HYDలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ సెక్టార్లు బలోపేతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
News March 7, 2026
BREAKING: భారీ షాక్ ఇచ్చిన బంగారం ధర

కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఇవాళ భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,510 పెరిగి రూ.1,63,640కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.2,300 ఎగబాకి రూ.1,50,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.
News March 7, 2026
సివిల్స్ అభ్యర్థులకు రేవంత్ అభినందనలు.. BRSపై విమర్శలు

TG: సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు అభ్యర్థులకు CM రేవంత్ అభినందనలు తెలిపారు. ‘రాజీవ్ సివిల్స్ అభయ హస్తం’ ద్వారా సాయం పొందిన 20 మంది మంచి ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. ‘గత ప్రభుత్వం పేదల బిడ్డలు బర్లు, గొర్లు కాసుకొని బతకాలని భావించింది. మన ప్రభుత్వం వారి విద్యకు ప్రాధాన్యం ఇచ్చి IASలు, IPSలుగా ఎదగాలని తోడుగా నిలుస్తోంది’ అని ట్వీట్ చేశారు. వారు TG పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్నారు.


