News July 6, 2024

ఇరాన్ అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియన్

image

ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో మసూద్ పెజెష్కియన్ గెలుపొందారు. ఇస్లామిస్ట్ వాది అయిన సయీద్ జలీలిపై గెలుపొందడంతో మసూద్ పాలన ఎలా ఉంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పోలింగ్‌లో పెజెష్కియన్‌కు 1.63 కోట్ల ఓట్లు రాగా సయీద్‌కు 1.35 కోట్ల ఓట్లు వచ్చాయి. మూడు కోట్ల మంది పోలింగ్‌లో పాల్గొన్నట్టు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. కాగా మసూద్ ఎన్నికతో ఇరాన్‌లో సంస్కరణలు జరిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.

Similar News

News March 29, 2026

ALERT: డిజిటల్ పేమెంట్లలో మార్పులు!

image

డిజిటల్ పేమెంట్స్‌‌లో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు RBI కొత్త నిబంధనలను తీసుకొస్తోంది. ఏప్రిల్ 1 నుంచి అన్ని ఆన్‌లైన్ చెల్లింపులకు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్(2FA) తప్పనిసరి చేయనుంది. అంటే OTPతో పాటు పిన్/పాస్‌వర్డ్/బయోమెట్రిక్ ద్వారా లావాదేవీలు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని వల్ల సైబర్ నేరగాళ్లకు పాస్‌వర్డ్/OTP తెలిసినప్పటికీ ట్రాన్సాక్షన్ పూర్తి చేయలేరు. దీంతో యూజర్లకు మరింత రక్షణ లభిస్తుంది.

News March 29, 2026

IPL: ముంబైపై KKR భారీ స్కోర్

image

ముంబైలోని వాంఖడే స్టేడియంలో MIతో జరిగిన మ్యాచ్‌లో రహానే, రఘువంశీ అర్ధశతకాలు బాదడంతో KKR భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 220 పరుగులు సాధించింది. ఓపెనర్లు రహానే(67), అలెన్(37) తొలి వికెట్‌కు 69 రన్స్ జోడించారు. ఆపై రింకూ సింగ్‌(33*)తో కలిసి రఘువంశీ(51) స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. గ్రీన్ 18 పరుగులకే ఔట్ అయ్యారు. MI బౌలర్లలో శార్దూల్ 3, హార్దిక్ ఒక వికెట్ తీశారు.

News March 29, 2026

జోనితా గాంధీ ఎవరంటే?

image

‘చిచ్చుబుడ్డి’ <<19508487>>పాటలో<<>> స్టెప్పులతో అదరగొట్టిన జోనితా గాంధీ గాయని. తెలుగు, హిందీ తదితర భాషల్లో సాంగ్స్ పాడారు. మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా షారుఖ్ ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో తొలుత SPBతో పాట పాడే అవకాశం ఆమెకు వచ్చింది. ‘కిక్-2’లోని ‘నువ్వేనువ్వే’ పాటతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. OK బంగారం, 24 తదితర సినిమాల్లో పాటలు పాడారు. ఢిల్లీలో పుట్టిన ఆమె టొరంటోలో చదువుకొని సంగీతంపై ఇష్టంతో ఇండియాకు తిరిగొచ్చారు.