News April 6, 2024
మరికాసేపట్లో ‘మాస్ DJ’ అప్డేట్

‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న నిర్మాత నాగవంశీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇవాళ ఉదయం 11.07 గంటలకు మాస్ డీజే అప్డేట్ ఉంటుందని.. వెయిట్ చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే ‘టిల్లు స్క్వేర్’కు సీక్వెల్గా ‘టిల్లు క్యూబ్’ రానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రేజీ అప్డేట్ ఏమై ఉంటుందా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News January 24, 2026
ఉపవాసంతో వృద్ధాప్యం దూరం

ఉపవాసం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. ఉపవాసం శరీరంలోని కణాలను రిపేర్ చేయడంతో పాటు, నిద్ర, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే BP, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుందంటున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యఛాయలను దూరం చెయ్యడంలో ఉపవాసం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు సిర్టుయిన్స్ ఉత్పత్తై వృద్ధాప్య ప్రక్రియకు వ్యతిరేకంగా పనిచేస్తాయంటున్నారు.
News January 24, 2026
IIT గువాహటిలో ఫ్యాకల్టీ పోస్టులు

<
News January 24, 2026
ట్రంప్ వెంటనే సారీ చెప్పాలి.. బ్రిటిష్ PM డిమాండ్

అఫ్గానిస్థాన్ యుద్ధంలో అమెరికా మినహా ఇతర NATO దేశాల సైనికులు సరిగా పోరాడలేదంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ మాటలు ‘అవమానకరం, దారుణం’ అంటూ బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ మండిపడ్డారు. యుద్ధంలో ప్రాణాలర్పించిన 457 మంది బ్రిటన్ సైనికుల త్యాగాలను తక్కువ చేయడం తగదని, ట్రంప్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలతో బాధిత కుటుంబాలను గాయపరచడం సరికాదన్నారు.


