News September 4, 2024

గొప్ప మనసు చాటుకున్న మాస్ మహారాజా!

image

మాస్ మహారాజా రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మూవీకి తాను తీసుకోవాల్సిన రెమ్యూనరేషన్‌లో రూ.4 కోట్లు తగ్గించుకున్నారని తెలుస్తోంది. రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన ఈ మూవీ కలెక్షన్లు రాబట్టలేకపోవడంతో నిర్మాత TG విశ్వప్రసాద్‌కు తీవ్ర నష్టాలు వచ్చాయని టాక్. దీంతో రవితేజ ఈ నిర్ణయం తీసుకుని నష్టాన్ని కొంత భర్తీ చేశారని సమాచారం. మరోవైపు దర్శకుడు హరీశ్ కూడా రూ.2 కోట్లు వెనక్కి ఇచ్చేశారని సమాచారం.

Similar News

News December 6, 2025

భారీ జీతంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>ఢిల్లీ<<>> మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ 7 మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC 26వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/ బీటెక్(ఎలక్ట్రానిక్స్& కమ్యూనికేషన్, CS, IT, ఎలక్ట్రికల్), MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్‌కు నెలకు రూ.81,000, మేనేజర్‌కు రూ.97,320 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://backend.delhimetrorail.com

News December 6, 2025

గుడికెళ్లి, దేవుడిని దర్శిస్తే పుణ్యం లభిస్తుందా?

image

ఆలయాలకు వెళ్లడం అంటే కేవలం దేవుడిని చూడటం కాదు. విగ్రహారాధనలోని రహస్యాన్ని, దర్శనం పరమార్థాన్ని తెలుసుకోవాలి. భగవంతుని గొప్ప లీలలు, గుణాలను మనసులో తలుచుకోవాలి. ఆయనే మనకు శరణం అని గుర్తించాలి. నిరంతరం ఆయనపై ధ్యానం ఉంచుతూ, ఆయనకు నచ్చిన మంచి పనులు చేయాలి. కేవలం దర్శనం కాకుండా, ఈ సత్యాన్ని గ్రహిస్తేనే మనం జీవితంలో మోక్షాన్ని సాధించగలం. <<-se>>#Bakthi<<>>

News December 6, 2025

టైప్ 5 డయాబెటిస్ సింప్టమ్స్ ఏంటో తెలుసా?

image

* న్యూట్రిషన్ డెఫిషియన్సీతో చర్మం, జుట్టు రంగుమారడం.
* లాలాజల గ్రంథుల్లో మార్పులు.
* రోగనిరోధక శక్తి తగ్గడంతో తరచూ చర్మం, చిగుళ్లు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల బారిన పడడం.
* BMI (18.5) కంటే తక్కువ ఉండడం.
* దీర్ఘకాల పోషకాహార లోపం వల్ల ఎదుగుదల ఆగిపోవడం వంటివి టైప్-5 డయాబెటిస్ లక్షణాలు.
* అధిక దాహం, ఒకేసారి బరువు తగ్గడం, నీరసం, కంటిచూపు తగ్గడం డయాబెటిస్ ముఖ్య లక్షణాలు.