News August 2, 2024
ACAలో మూకుమ్మడి రాజీనామాలు

AP: ACA (ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడు శరత్చంద్రారెడ్డి నాయకత్వంలోని అపెక్స్ కౌన్సిల్ మూకుమ్మడిగా రాజీనామా చేసింది. దీంతో ACAను రాజకీయాలకు అతీతంగా ప్రక్షాళన చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. TDP MP కేశినేని చిన్ని ACA ప్రక్షాళన పనులు చూస్తున్నారట. ఈ నెల 4న విజయవాడలో జరిగే SGMలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. MSK ప్రసాద్, JC పవన్ ACAలో కీలకంగా వ్యవహరించనున్నట్లు సమాచారం.
Similar News
News September 18, 2025
భారత్ డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రం.. ట్రంప్ తీవ్ర ఆరోపణ

భారత్, చైనా, పాక్ సహా 23 దేశాలు డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. ఈ దేశాలు డ్రగ్స్, వాటి తయారీకి కావాల్సిన రసాయనాలను ఉత్పత్తి, రవాణా చేస్తూ US ప్రజల భద్రతకు ప్రమాదంగా మారాయని విమర్శించారు. అఫ్గాన్, మెక్సికో, హైతీ, కొలంబియా, పెరూ, పనామా, బొలీవియా, బర్మా వంటి దేశాలు ఈ లిస్ట్లో ఉన్నాయి. US కాంగ్రెస్కు సమర్పించిన ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్లో ఈ ఆరోపణలు చేశారు.
News September 18, 2025
నేడు రాహుల్ గాంధీ ‘స్పెషల్’ ప్రెస్ మీట్

ఇవాళ రాహుల్ గాంధీ ఓ స్పెషల్ ప్రెస్ మీట్ నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఢిల్లీలోని ఇందిరా భవన్ ఆడిటోరియంలో ఉ.10 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడతారని తెలిపింది. అయితే ఏ అంశాలపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. కొత్తగా రెండు రాష్ట్రాల్లోని రెండు నియోజకవర్గాలు, హై ప్రొఫైల్ లోక్సభ స్థానంపై ఓట్ చోరీ ఆరోపణలు చేస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
News September 18, 2025
2030 నాటికి 1.14 లక్షల మందికి ఉపాధి: భట్టి

TG: గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా రూ.1.98 లక్షల కోట్ల పెట్టుబడితో 20 వేల మెగావాట్ల రీ యూజబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ‘2030 నాటికి ఈ పాలసీతో 1.14 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. మహిళా సంఘాల ద్వారా 2 వేల మెగావాట్ల సోలార్ ఎనర్జీ ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం. ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం’ అని తెలిపారు.