News March 11, 2025

150 మంది సైనికుల ఊచకోత!

image

పాకిస్థాన్‌లో BLA (బలూచ్ లిబరేషన్ ఆర్మీ) నరమేధం సృష్టించింది. తమ అధీనంలో ఉన్న 450 మందిలో 150 మంది సైనికులను ఊచకోత కోసినట్లు బీఎల్ఏ స్వయంగా ప్రకటించింది. తమపై సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాగా బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బీఎల్ఏ హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఆ రైలులో ప్రయాణిస్తున్న వందలాదిమందిని బందీలుగా తీసుకున్నారు.

Similar News

News March 12, 2025

శాసనమండలిలో వైసీపీ నిరసన

image

AP: నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్లపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడంతో ఆ పార్టీ సభ్యులు మండలిలో నిరసనకు దిగారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. బాబు ష్యూరిటీ మోసానికి గ్యారంటీ అంటూ విమర్శలు చేశారు. పోడియం వద్దకు వెళ్లి వైసీపీ సభ్యులు ఆందోళన చేయడంతో మండలిని స్పీకర్ వాయిదా వేశారు.

News March 12, 2025

సాయంకాలం వాకింగ్ చేస్తున్నారా?

image

వేసవికాలంలో సాయంకాలం వాకింగ్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీంతో రాత్రి పూట నిద్ర బాగా పడుతుందని అంటున్నారు. ప్రతి రోజూ అరగంట నడిస్తే మెదడు ఉత్సాహంగా పనిచేయడమే కాకుండా రక్తపోటు సమస్య రాదు. సాయంకాలపు నడకతో శరీరంలోని కండరాలు బలపడటమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రాత్రి భోజనం తర్వాత కాసేపు నడవాలని సూచిస్తున్నారు.

News March 12, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 పెరిగి రూ.80,650లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.490 తగ్గడంతో రూ.87,980కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,06,900గా ఉంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.

error: Content is protected !!