News May 8, 2024

ఓపెనర్ల ఊచకోత.. SRH రికార్డు విజయం

image

లక్నోతో జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన SRH 9.4 ఓవర్లలోనే విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్లు హెడ్(89*), అభిషేక్(75*) LSG బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్లిద్దరూ పోటీపడి బౌండరీలు బాదారు. ఈ విజయంతో SRH ప్లేఆఫ్ ఆశలు మరింత మెరుగయ్యాయి.

Similar News

News February 4, 2026

దేవరకద్ర ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ

image

దేవరకద్ర ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. జీనుగరాలకు చెందిన వెంకటేష్ యాదవ్ లోన్ కోసం ఓ డాక్యుమెంట్‌పై ఎమ్మార్వో దీపిక సంతకాన్ని ఫోర్జరీ చేశారు. తప్పుడు సంతకంపై బ్యాంకు అధికారులు ఎమ్మార్వోకు సమాచారం అందించారు. దీంతో ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 4, 2026

మళ్లీ పుంజుకున్న గోల్డ్ రేట్స్!

image

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతవారం స్వల్పంగా తగ్గిన పసిడి ధర ఇవాళ తిరిగి $5,000(ఔన్స్‌కు) మార్కును దాటింది. USA-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, డాలర్ బలహీనపడటం, సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్లతో ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో HYD మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర ₹1,60,530కు చేరింది.

News February 4, 2026

ఆ ఏడుగురు MLAలకు మున్సి‘పోల్స్’ సవాలే

image

TG: BRS నుంచి ఎన్నికై INCకి దగ్గరగా మెలగుతున్న MLAలకు మున్సి‘పోల్స్’ సవాలుగా మారాయి. శ్రీహరి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట రావు, సంజయ్ కుమార్, కృష్ణ మోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, యాదయ్య నియోజకవర్గాల్లోని స్థానాలపై CM రేవంత్ నివేదికలు రప్పిస్తున్నారు. ఇక్కడి పార్టీ శ్రేణులు ఎన్నికల్లో ఏమేరకు సహకరిస్తాయో అన్న అనుమానాలు వారిని పీడిస్తున్నాయి. మరోవైపు ఈ మున్సిపాల్టీల్లోని తమ క్యాడర్‌ను BRS ఏకం చేస్తోంది.