News January 7, 2025

భారీ భూకంపం.. 53కి చేరిన మరణాలు

image

నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. టిబెట్‌లో ఇప్పటివరకు 53 మంది మరణించినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. 62 మందికి గాయాలైనట్లు తెలిపింది. 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు పేర్కొంది.

Similar News

News January 8, 2025

కాల్‌బ్యాక్ చేస్తే రూ.300 కట్: యూజర్లకు JIO వార్నింగ్!

image

‘ప్రీమియం రేట్ సర్వీస్ స్కామ్’పై యూజర్లకు రిలయన్స్ జియో వార్నింగ్ ఇచ్చింది. +91 మినహా మరే ప్రిఫిక్స్‌తో ఇంటర్నేషనల్ కాల్స్ వచ్చినా జాగ్రత్తపడాలని ఈమెయిల్స్ పంపింది. రీసెంటుగా ISD నంబర్లతో మిస్డ్ కాల్స్ వస్తున్నాయి. ఆత్రుత కొద్దీ కాల్ బ్యాక్ చేస్తే నిమిషానికి రూ.200-300 వరకు ఛార్జ్ అవుతోంది. స్కామర్లు కస్టమర్ల జేబులకు ఇలా కత్తెరేస్తుండటంతో ఇంటర్నేషనల్ కాల్ బ్లాకింగ్ పెట్టుకోవాలని JIO సూచించింది.

News January 8, 2025

KCRపై ఈడీకి, KTRపై ఏసీబీకి ఫిర్యాదు

image

TG: మాజీ మంత్రి KTRపై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. రూ.7,380 కోట్ల ORR టోల్ టెండర్లలో అవినీతి జరిగిందని వనపర్తి జిల్లా వాసి యుగంధర్ ఫిర్యాదు చేశారు. క్విడ్ ప్రో కో జరిగిందని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే వ్యవహారంపై KTRతో పాటు KCRపైనా ఈడీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ A-1గా ఉన్నారు.

News January 8, 2025

NETను తొలగించాలని UGC నిర్ణయం?

image

ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు, పదోన్నతులకు తప్పనిసరి అయిన నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(NET)ను తొలగించాలని UGC సిఫార్సు చేసింది. స్టాఫ్ నియామకాలకు సంబంధించి డ్రాఫ్ట్ ముసాయిదా నిబంధనలను రిలీజ్ చేసింది. FEB 5లోపు వీటిపై అభిప్రాయాన్ని సమర్పించాలని స్టేక్ హోల్డర్లను కోరింది. కొత్త రూల్స్ ప్రకారం NET రాయకుండానే ME/MTECHలో 55% మార్క్స్ సాధించిన వారు స్టాఫ్ పోస్టులకు అర్హత సాధిస్తారు.