News October 4, 2024

భారీ ఎన్‌కౌంటర్.. 30 మంది మావోలు మృతి

image

మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 30 మంది మరణించారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనాస్థలంలో బలగాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి.

Similar News

News November 14, 2025

దుల్కర్ ‘కాంత’ మూవీ పబ్లిక్ టాక్

image

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీబోర్సే జంటగా నటించిన ‘కాంత’ మూవీ ప్రీమియర్లు నిన్న పడ్డాయి. సినిమా థ్రిల్‌కు గురి చేస్తుందని మూవీ చూసినవారు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దుల్కర్, భాగ్యశ్రీ యాక్టింగ్ అదిరిపోయిందని అంటున్నారు. విజువల్స్ బాగున్నాయని చెబుతున్నారు. అయితే సెకండాఫ్ కాస్త స్లోగా, బోరింగ్‌గా ఉందని మరికొందరు అంటున్నారు. మరికొన్ని గంటల్లో Way2News రివ్యూ.

News November 14, 2025

308 అప్రెంటిస్‌లు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ 308 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ, వొకేషనల్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌లు 300 ఉండగా.. వొకేషనల్ అప్రెంటిస్‌లు 8 ఉన్నాయి. అభ్యర్థుల వయసు కనీసం 18ఏళ్లు నిండి ఉండాలి. షార్ట్ లిస్టింగ్, విద్యార్హతలో మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cochinshipyard.in/

News November 14, 2025

ఎలాంటి పాడి పశువులతో డెయిరీ ఫామ్ ప్రారంభించాలి?

image

గేదె పాలుకు ఎక్కువ మార్కెట్ డిమాండ్ ఉంటే గేదెలతో, ఆవు పాలకు ఎక్కువ డిమాండ్ ఉంటే సంకర జాతి ఆవులతో డెయిరీ ఫామ్ ప్రారంభించాలి. పాల సేకరణ కేంద్రాలు ఉండే ప్రాంతాలలో సంకర జాతి ఆవులు లేక ముర్రా జాతి గేదెలతో ఫారాన్ని ప్రారంభించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. పచ్చిమేత వనరులు, మంచి యాజమాన్యం ఉంటే హోలిస్టీన్ ఫ్రీజియన్ సంకర జాతి ఆవులతో, సాధారణమైన మేత వనరులుంటే జెర్సీ సంకర జాతి ఆవులతో ఫామ్ ప్రారంభించాలి.