News May 7, 2025
భారీ ఎన్‌కౌంటర్.. 37 మంది మృతి?

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో కాల్పుల మోత మోగుతోంది. వెయ్యి మంది మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు భారీ కూంబింగ్ చేపట్టాయి. ఈక్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 37 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఐదు రోజులుగా భద్రతా దళాలు ఇక్కడ అడవిని జల్లెడ పడుతున్నాయి.
Similar News
News August 10, 2025
ఈసీ ఆదేశాలు TDP బేఖాతరు చేస్తోందంటూ YCP విమర్శలు

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల ప్రచారం సా.5గంటలతో ముగిసింది. అయినా, స్థానికేతర కూటమి నేతలు ఒంటిమిట్టలో తిష్ట వేశారని YCP నేతలు ఆరోపిస్తున్నారు. ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ హరిత హోటల్ వేదికగా టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కూటమి నేతలకు పోలీసులు మద్దతు పలుకుతున్నారని, ఎన్నికల సంఘం దీనిపై యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు.
News August 10, 2025
అల్పపీడనం.. 4 రోజులు అతిభారీ వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆగస్టు 13, 14, 15, 16వ తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. చెట్లు, శిథిలావస్థలో ఉన్న భవనాల కింద, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.
News August 10, 2025
పులివెందుల వైపే రాష్ట్రం చూపు..

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికల బరిలో 11 మంది చొప్పున బరిలో ఉన్నా ప్రధాన పోటీ టీడీపీ, YCP అభ్యర్థుల మధ్యే ఉంది. పులివెందులలో హేమంత్ రెడ్డి(వైసీపీ), మారెడ్డి లతారెడ్డి(TDP) మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశముంది. ఒంటిమిట్టలో సుబ్బారెడ్డి(YCP), ముద్దు కృష్ణ రెడ్డి(టీడీపీ) బరిలో నిలిచారు. అటు వైసీపీ చీఫ్ జగన్ పులివెందుల MLA కావడంతో ఈ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.