News March 20, 2025
భారీ ఎన్‌కౌంటర్: 30కి చేరిన మృతుల సంఖ్య

ఛత్తీస్‌గఢ్‌లోని అండ్రీ అడవుల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 30 మంది నక్సలైట్లు మరణించారు. ఈ పోరులో డీఆర్‌జీ జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది, కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మరణించారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 22, 2025
ఆరో తరం ఫైటర్ జెట్‌పై అమెరికా చూపు

ఓవైపు ప్రపంచదేశాలు ఐదో తరం ఫైటర్ జెట్ గురించి ఆలోచిస్తుంటే అమెరికా ఆరో తరంపై దృష్టి సారించింది. అత్యాధునిక యుద్ధవిమానాన్ని రూపొందించే బాధ్యతను ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ బోయింగ్‌కు అప్పగించారు. ‘ప్రపంచంలో మరే విమానం కూడా దరిదాపుల్లోకి రాని విధంగా మా ఫైటర్ జెట్ ఉంటుంది. దాన్ని ఎఫ్-47గా పిలుస్తున్నాం. ఇప్పటికే ఐదేళ్లుగా దాని ప్రయోగాత్మక వెర్షన్‌ను రహస్యంగా పరీక్షిస్తున్నాం’ అని వెల్లడించారు.
News March 22, 2025
BREAKING: దిగ్గజ బాక్సర్ కన్నుమూత

ప్రముఖ బాక్సింగ్ దిగ్గజం జార్జ్ ఫోర్‌మెన్(76) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1968 ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలవడంతో పాటు రెండు సార్లు హెవీ వెయిట్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచారు. తన కెరీర్లో 68 నాకౌట్లలో పాల్గొనగా ఐదింట్లో మాత్రమే ఓటమి పాలయ్యారు. 1997లో బాక్సింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రముఖ బాక్సర్ మహమ్మద్ అలీతో 1974లో జరిగిన పోరులో ఓటమి పాలయ్యారు.
News March 22, 2025
IPL: టాప్‌లో వీరే..

★ అత్యధిక పరుగులు-కోహ్లీ(8004)
★ అత్యధిక వికెట్లు- చాహల్(205)
★ అత్యధిక సార్లు విజేత-ముంబై, చెన్నై(ఐదేసి సార్లు)
★ అత్యధిక ఫోర్లు- శిఖర్ ధవన్(768)
★ అత్యధిక POTM అవార్డులు- ఏబీ డివిలియర్స్(25)
★ అత్యధిక టీమ్ స్కోరు-SRH(287/3)
★ అత్యధిక సెంచరీలు-కోహ్లీ(8)
★ అత్యధిక అర్ధసెంచరీలు-వార్నర్(66)