News March 25, 2025

భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు మృతి

image

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఐదుగురు నక్సల్స్ హతమయ్యారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా ఇటీవల పలు ఎన్‌కౌంటర్లలో భారీగా మావోలు మరణించిన విషయం తెలిసిందే.

Similar News

News March 26, 2025

చాహల్-ధనశ్రీ విడాకులకు కారణమిదేనా?

image

టీమ్ ఇండియా క్రికెటర్ చాహల్-ధనశ్రీవర్మ విడాకులకు ఓ బలమైన కారణమున్నట్లు తెలుస్తోంది. పెళ్లైనప్పటి నుంచి ధనశ్రీ హరియాణాలోని చాహల్ ఇంట్లో ఉంటున్నారు. ఈవెంట్స్ ఉన్నప్పుడు ముంబైకి వెళ్లి వస్తూ ఉంటారు. కానీ అటు ఇటు తిరగలేక ఆమె ముంబైలో వేరుకాపురం పెడదామని చాహల్‌ను కోరగా ఒప్పుకోలేదట. తన తల్లిదండ్రులతోనే కలిసి ఉండాలని ఆయన తేల్చిచెప్పారు. దీనిపైనే వీరి మధ్య విభేదాలు తలెత్తి విడాకులకు దారితీసిందని సమాచారం.

News March 26, 2025

కోడిగుడ్డు వెజ్జా.. నాన్ వెజ్జా?

image

ఇదేం ప్రశ్న అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. కానీ చాలా మంది గుడ్డును నాన్ వెజ్‌గా పరిగణించడం లేదు. శాకాహారులమని, ఎగ్ తమ మెనూలో భాగమని చెబుతుంటారు. అండం ఫలదీకరణం చెందని కారణంగా అది మాంసాహారం కిందికి రాదనేది వారి వాదన. కానీ మరో జీవి నుంచి ఉత్పత్తి అయింది కాబట్టి గుడ్డు మాంసాహారమేనని పరిశోధకులు చెబుతున్నారు. ఏదేమైనా పోషకాల్లో మాత్రం గుడ్డు వెరీ గుడ్ అని, రోజుకో ఎగ్ తినడం మేలని పేర్కొంటున్నారు.

News March 26, 2025

ఎమ్మెల్యేను బహిష్కరించిన బీజేపీ

image

అక్రమ బంగారం సరఫరా కేసులో పట్టుబడిన నటి <<15789629>>రన్యా రావుపై అసభ్యకర వ్యాఖ్యలు <<>>చేసిన కర్ణాటక ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నల్‌పై బీజేపీ వేటు వేసింది. పదే పదే క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందుకు ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటనలో పేర్కొంది. పార్టీ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

error: Content is protected !!