News April 16, 2024
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మరణించారు. ముగ్గురు పోలీసులకూ గాయాలైనట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని కాంకేర్ జిల్లా పోలీసులు వెల్లడించారు.
Similar News
News April 5, 2026
ధనుష్‌లో మా నాన్నను చూసుకున్నా: విఘ్నేశ్ శివన్

ధనుష్‌తో విభేదాలపై నయనతార భర్త, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ విచారం వ్యక్తం చేశారు. ‘ధనుష్ పుట్టిన జులై 28నే మా నాన్న చనిపోయారు. అందుకే ఆయనలో నాన్నను చూసుకున్నా. ఆయనతో బంధాన్ని కోల్పోవడంపై సిగ్గుపడుతున్నా. నేను ఈ స్థాయిలో ఉండేందుకు కారణం ధనుష్. VIP మూవీ టైంలో రెండేళ్లు కలిసి ఉన్నా’ అని యూట్యూబ్ ఇంటర్వ్యూలో తెలిపారు. నయనతార డాక్యుమెంటరీ విషయంలో వీరి మధ్య <<14626837>>వివాదం<<>> తలెత్తడం తెలిసిందే.
News April 5, 2026
హార్ముజ్‌ను తెరవండి.. లేదంటే నరకానికి పంపిస్తా: ట్రంప్

హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని ఇరాన్‌కు US అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. లేదంటే వచ్చే మంగళవారం పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ‘జలసంధిని తెరవండి పిచ్చి బా*ర్డ్స్. లేదంటే నరకానికి పంపిస్తా. అల్లాను ప్రార్థించండి’ అంటూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. 48 గంటల్లో హార్ముజ్‌ను ఓపెన్ చేయకపోతే <<19568118>>ప్రళయం<<>> సృష్టిస్తామని నిన్న ట్రంప్ హెచ్చరించడం తెలిసిందే.
News April 5, 2026
బంగ్లాదేశ్ సరిహద్దులో పాములు, మొసళ్లతో రక్షణ!

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు రక్షణ కోసం మొసళ్లు, విషపూరితమైన పాములను ఉంచాలని BSF యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫెన్సింగ్ వేయడం సాధ్యం కాని 175 కి.మీ మేర వీటితో రక్షణ కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే BSFకు సిబ్బంది కొరత ఉండగా ఆ సమస్య కూడా తీరుతుందని భావిస్తున్నారు. కాగా బంగ్లాతో మనకు 4,096 KM సరిహద్దు ఉండగా ఇప్పటివరకు 3,240 KM మేర ఫెన్సింగ్ వేశారు.


