News June 15, 2024

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది నక్సల్స్ హతం

image

ఛత్తీస్‌‌గఢ్‌లోని అబుజ్‌మడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది నక్సల్స్ హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. నారాయణ్‌పుర్, కాంకేర్, దంతేవాడ, కొండగావ్ జిల్లాలకు చెందిన జవాన్లు సంయుక్తంగా ఈ యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

Similar News

News January 7, 2026

మీ పిల్లలు అబద్ధాలు చెబుతున్నారా?

image

తల్లిదండ్రులతో టీనేజర్స్ ఎక్కువగా అబద్ధాలు చెబుతుంటారు. అయితే ఇది కౌమారదశలో ఓ భాగమని నిపుణులు చెబుతున్నారు. పేరెంట్స్ ఏమంటారోనని భయంతో, ‘మేం మంచి పిల్లలం’ అనిపించుకోడానికి అబద్ధాలు చెబుతారని అంటున్నారు. తమ హద్దులు, అమ్మానాన్నల రియాక్షన్స్ తెలుసుకోవడానికి నిజాలు దాస్తారని పేర్కొంటున్నారు. వాళ్లు మరింత స్వేచ్ఛను కోరుకుంటున్నారని అర్థమని, అతిగా నిర్బంధించవద్దని సూచిస్తున్నారు.

News January 7, 2026

విజయ్ ‘జన నాయగన్’ విడుదల వాయిదా!

image

సెన్సార్ జాప్యంతో విజయ్ నటించిన ‘జన నాయగన్’ <<18789554>>వాయిదా<<>> పడినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ RFT Films ట్వీట్ చేసింది. ఇప్పటికే చెన్నైలో బుక్ మై షో నుంచి ఈ మూవీని తొలగించడంతో తమిళనాడులోనూ పోస్ట్‌పోన్ అయినట్లేనని సినీవర్గాలు చెబుతున్నాయి. అటు సినిమా వాయిదా పడిందని తమిళ మీడియా పేర్కొంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ చిత్రం ఎల్లుండి రిలీజ్ కావాల్సి ఉండగా అదే రోజు తీర్పు చెప్తామని కోర్టు తెలిపింది.

News January 7, 2026

భారత్ ఘన విజయం

image

సౌతాఫ్రికాతో జరిగిన యూత్ మూడో వన్డేలో భారత అండర్-19 జట్టు ఘన విజయం సాధించింది. తొలుత భారత్ 50 ఓవర్లలో 393/7 రన్స్ చేసింది. ఓపెనర్లు ఆరోన్ జార్జ్ (118), వైభవ్ సూర్యవంశీ (127) సెంచరీలతో చెలరేగారు. అనంతరం సౌతాఫ్రికా 35 ఓవర్లలో 160కే కుప్పకూలింది. టాప్-4 ఆటగాళ్లు డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయారు. దీంతో 233 పరుగుల భారీ తేడాతో భారత్ విజయదుందుభి మోగించింది. 3 వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది.