News December 1, 2024

ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం

image

TG: ములుగు జిల్లా ఏటూరునాగారంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. తెలంగాణ గ్రే హౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. మృతుల్లో మావోయిస్టు కీలక నేత బద్రు సహా ఇతరులు ఉన్నట్లు సమాచారం.

Similar News

News April 3, 2026

IPL: టాస్ గెలిచిన PBKS

image

చెన్నై వేదికగా CSKతో జరగనున్న మ్యాచులో PBKS టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

CSK: రుతురాజ్, శాంసన్, ఆయుష్, ప్రశాంత్ వీర్, దూబే, కార్తీక్ శర్మ, సర్ఫరాజ్, నూర్ అహ్మద్, హెన్రీ, కాంబోజ్, ఖలీల్

PBKS: ప్రభ్‌సిమ్రన్, కూపర్, శ్రేయస్, నేహాల్, శశాంక్, స్టోయినిస్, మార్కో యాన్సెన్, జేవియర్, విజయ్‌కుమార్, అర్ష్‌దీప్, చాహల్

News April 3, 2026

ఈ క్షీరదం పాలు నీటిలో కలిసిపోవు!

image

సముద్రపు వింతల్లో తిమింగలం పాలు ఒకటి. ఇవి ఆవు పాలలా పల్చగా ఉండవు. వెన్న మాదిరిగా గట్టిగా ఉంటాయి. ఇందులో 50% కొవ్వు ఉండటమే దీనికి కారణం. ఈ చిక్కదనం వల్ల పాలు నీటిలో కలిసిపోవు. దీనివల్ల తిమింగలం పిల్లలు నీటి అడుగున కూడా సులభంగా పాలు తాగగలుగుతాయి. ఈ అధిక కొవ్వు సముద్రపు చలిని తట్టుకోవడానికి అవసరమైన శక్తిని పిల్లలకు అందిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో (37/100)

News April 3, 2026

నెలవంకలా భూమి.. అద్భుతమైన ఫొటో

image

భూమిపై నుంచి చంద్రుని నెలవంక అందంగా ఉంటుంది. అలాగే ఆకాశం నుంచి మన భూమి నెలవంక మహాద్భుతంలా ఉంటుందని పై ఫొటో చూస్తే తెలుస్తోంది. ఇటీవల నాసా ప్రయోగించిన <<19555072>>ఆర్టెమిస్-2<<>> వేలాది మైళ్ల ఎత్తు నుంచి ధరణి ఫొటోలను క్లిక్ మనిపించింది. నెలవంకలా దర్శనమిస్తోన్న ఈ చిత్రాలు SMలో వైరలవుతున్నాయి.