News April 9, 2025

ఘోర అగ్ని ప్రమాదం.. 20 మంది మృతి

image

చైనా హెబీ ప్రావిన్స్‌లోని ఓ నర్సింగ్ హోమ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది చనిపోగా పలువురు గాయపడినట్లు అక్కడి మీడియా తెలిపింది. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఫైర్ యాక్సిడెంట్‌కు గల కారణాలను వెల్లడించలేదు. అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించింది.

Similar News

News February 1, 2026

‘పంచభక్ష్య పరమాన్నాలు’ అంటే తెలుసా?

image

మంచి భోజనాన్ని మన పెద్దలు ‘పంచభక్ష్య పరమాన్నాలు’ అని పిలుస్తుంటారు. దీని అర్థం మనం తినే పదార్థాలు ఐదు రకాలుగా ఉంటాయని శాస్త్రం చెబుతోంది.
భక్ష్యం: గారెలు, బూరెలు వంటి కొరికి తినే పదార్థాలు.
భోజ్యం: పులిహోర, దద్ధోజనం వంటి నమిలి తినేవి.
చోష్యం: పాయసం, చారు వంటి జుర్రుకునేవి.
లేహ్యం: తేనె, చలివిడి వంటి నాకబడేవి.
పానీయం: నీళ్లు, పండ్ల రసం వంటి తాగే పదార్థాలు.

News February 1, 2026

భారత్ U19 జట్టు ఆలౌట్.. పాక్ టార్గెట్ ఎంతంటే?

image

U19 వరల్డ్ కప్‌లో భాగంగా పాక్‌తో జరుగుతున్న సూపర్-6 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో వేదాంత్ త్రివేది(68) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. చౌహన్ (35), అంబ్రిష్ (29), వైభవ్ (30) రాణించారు. చివరి 10 ఓవర్లలో భారత్ 72 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. పాక్ సెమీస్ వెళ్లాలంటే 33.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాలి.

News February 1, 2026

‘ఫార్మర్ రిజిస్ట్రీ’లో పేరు నమోదు చేసుకోకపోతే..

image

AP: రైతులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు కేంద్రం ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ నమోదును చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఇప్పటికీ 13L మంది రిజిస్టర్ చేసుకోలేదు. వీరు PM కిసాన్-అన్నదాత సుఖీభవ(ఏటా ₹20K) నిధులు పొందలేరని వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ వెల్లడించారు. రైతు సేవా కేంద్రాలు లేదా APAIMS 2.0 యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఈ-పంట నమోదునూ రైతులే యాప్ ద్వారా చేసుకోవచ్చని తెలిపారు.