News September 26, 2024
జంట జలాశయాలకు భారీ వరద

TG: హైదరాబాద్ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వస్తుండటంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఎత్తి 234 క్యూసెక్కులు, హిమాయత్ సాగర్ ఒక గేటు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ఇటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Similar News
News January 31, 2026
10 రోజుల్లో కొత్త సినిమా అప్డేట్: అనిల్

కొత్త సినిమాపై మరో 10-15 రోజుల్లో అప్డేట్ ఇస్తానని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు. మూవీపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాక ఆయన మీడియాతో మాట్లాడారు. తన తర్వాతి మూవీ వెంకటేశ్‌తో తీస్తున్నారని, కార్తీ లేదా ఫహాద్ ఫాజిల్ నటించే అవకాశం ఉందని సినీవర్గాల టాక్. ఇటీవల చిరంజీవి హీరోగా ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రంతో అనిల్ సూపర్ హిట్ అందుకోవడం తెలిసిందే.
News January 31, 2026
కృష్ణుడికి సైతం ఆగ్రహం తెప్పించే కొన్ని పనులివే!

నిత్యం స్నానం చేయకుండా ఉన్నవారిపై శ్రీకృష్ణుడు కోపంగా ఉంటాడని పండితులు చెబుతున్నారు. ఆడవాళ్లు కొన్ని సందర్భాల్లో తులసిని తాకడం, సూర్యాస్తమయం తర్వాత, ఏకాదశి వంటి పవిత్ర దినాల్లో తులసిని కోయకూడదని అంటున్నారు. దానివల్ల ఆయన తీవ్ర అసహనానికి గురవుతాడట. అలాగే, నిష్కామ కర్మను విస్మరించి ఫలితం కోసం పాకులాడటం, ధర్మాన్ని తప్పి అధర్మ మార్గంలో పయనించడం కూడా కృష్ణుడికి నచ్చవని అంటున్నారు.
News January 31, 2026
రాష్ట్రవ్యాప్త నిరసనలకు BRS పిలుపు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలంటూ KCRకు SIT నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టాలని BRS పిలుపునిచ్చింది. కక్షసాధింపులకు వ్యతిరేకంగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలంది. ప్రతి మున్సిపాల్టీల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, నల్ల జెండాలతో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని పేర్కొంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా KCRను వేధిస్తోందని దుయ్యబట్టింది.


