News April 14, 2025
నేటి నుంచి భారీ స్థాయిలో జాబ్ నోటిఫికేషన్లు: మంత్రులు

TG: ఇకపై విద్య, <<16093517>>ఉద్యోగాల్లో<<>> SC వర్గీకరణ అమలు అవుతుందని మంత్రులు దామోదర, ఉత్తమ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. SC వర్గీకరణ నేటి నుంచి అమల్లోకి వస్తుందని, నేటి నుంచి భారీ స్థాయిలో జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం జారీ చేసే అన్ని జాబ్ నోటిఫికేషన్లకు SC వర్గీకరణ వర్తిస్తుందన్నారు. SC వర్గీకరణ గురించి చాలా పార్టీలు మాట్లాడాయని, కానీ దాని కోసం ప్రయత్నం చేయలేదని అన్నారు.
Similar News
News January 26, 2026
ఈ నెల 28న క్యాబినెట్ భేటీ

AP: సీఎం CBN అధ్యక్షతన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 28న క్యాబినెట్ భేటీ కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆయన 29న అరకులో పర్యటించనున్నట్లు చెప్పాయి. 30, 31వ తేదీల్లో కుప్పంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని వివరించాయి. అలాగే రేపు 4pmకు TDP కేంద్ర కార్యాలయానికి వెళ్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అక్కడ పార్టీ సీనియర్ నాయకులతో భేటీ అవుతారని తెలుస్తోంది.
News January 26, 2026
‘జన గణ మన’లాగే ఇక వందేమాతరానికీ నిలబడాలా?

జాతీయ గీతం ‘జన గణ మన’కు వర్తించే గౌరవ ప్రొటోకాల్‌ను జాతీయ గేయం వందేమాతరానికీ వర్తింపజేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. అదే జరిగితే జన గణ మన పాడేటప్పుడు నిలబడినట్లుగానే వందేమాతరం ఆలపించేటప్పుడూ నిలబడాల్సి ఉంటుంది. ప్రొటోకాల్‌ను వందేమాతరానికీ వర్తింపజేయాలన్న డిమాండ్ చాలాకాలం నుంచి ఉంది. దీనిపై సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.
News January 26, 2026
‘స్పిరిట్’లో మెగాస్టార్ చిరంజీవి?

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో ‘స్పిరిట్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌కు ఫాదర్ రోల్‌లో ఆయన కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. 15 నిమిషాల పాటు కనిపించే పాత్రకు ఆయన ఓకే చెప్పారని టాక్. అయితే ఈ విషయమై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ‘స్పిరిట్’ వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కానుంది.


