News May 12, 2024

ఈసారి భారీ పోలింగ్ నమోదు?

image

AP: గత ఎన్నికలతో పోలిస్తే ఆంధ్రాలో ఈసారి పోలింగ్ భారీగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి ప్రజలు మునుపెన్నడూ లేనంతగా ఓటర్లు స్వస్థలాలకు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈసారి యువత చైతన్యవంతంగా కనిపిస్తున్నారని, ఫలితాల విషయంలో ఇది కీలకం కానుందని ఎన్నికల పరిశీలకులు చెబుతున్నారు. అటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కూ ఉద్యోగుల నుంచి అనూహ్య స్పందన లభించిన సంగతి తెలిసిందే.

Similar News

News September 15, 2025

వేధింపులతో ఉద్యోగి సూసైడ్.. రూ.90 కోట్ల పరిహారం

image

జపాన్‌లో వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న ఓ ఉద్యోగినికి కోర్టు రూ.90 కోట్ల పరిహారం ప్రకటించింది. 2023లో సతోమి(25)కి వర్క్ ప్లేస్‌లో వేధింపులు ఎదురయ్యాయి. 2021లో ఆ కంపెనీ ప్రెసిడెంట్ బాధిత యువతిని ‘వీధి కుక్క’ అని తిట్టారు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన ఆమె సూసైడ్ అటెంప్ట్ చేశారు. 2023లో మరణించారు. ఆమె మరణంపై యువతి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించగా రూ.90 కోట్లు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.

News September 15, 2025

రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియా కేటాయించండి: తుమ్మల

image

TG: రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియా కేటాయించాలని‌ కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఢిల్లీ వెళ్లిన మంత్రి యూరియా కేటాయింపులు వీలైనంత త్వరగా చేయాలని విన్నవించారు. దేశీయ యూరియా ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేదని ఆయన మంత్రికి వివరించారు. విదేశాల నుంచి దిగుమతయ్యే యూరియాలో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని రజత్‌ కుమార్‌ తెలిపారు.

News September 15, 2025

కేటీఆర్‌లా బెదిరింపు దావాలు వేయను: బండి

image

TG: KTR తనపై వేసిన <<17719172>>పరువునష్టం దావా<<>>పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటా. కేటీఆర్‌‌లా బెదిరింపుల కోసం దావాలు వేయను. దావా వేయాలనుకుంటే కేసీఆర్, కేటీఆర్ బయటికే రారు. మీరు తిట్టని తిట్లు లేవు. నేను లవంగం తింటే తంబాకు అన్నావ్. నన్ను వాడు, వీడు అన్నావ్. మీ అయ్య నా తల ఆరు ముక్కలు నరుకుతా అన్నాడు. వీటన్నింటిపై పరువు నష్టం దావా వేయరాదా?’ అని బండి ప్రశ్నించారు.