News April 8, 2025

‘కియా’ పరిశ్రమలో భారీ చోరీ

image

AP: శ్రీ సత్యసాయి జిల్లాలోని కియా కార్ల పరిశ్రమలో దొంగలు పడ్డారు. ఏకంగా 900 ఇంజిన్లను చోరీ చేశారు. గత నెలలోనే ఈ ఘటన జరిగినా ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయాన్ని బయటికి రాకుండా చూడాలని కియా యాజమాన్యం పోలీసుల్ని కోరినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని అధికారులు చెప్పడంతో గత నెల 19న కంప్లైంట్ రిజిస్టర్ చేశారని సమాచారం.

Similar News

News February 10, 2026

పార్లమెంట్‌ను కుదిపేస్తున్న పుస్తకం

image

పబ్లిష్ కూడా కాకుండానే ఒక పుస్తకం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్మీ మాజీ చీఫ్ నరవణె <<19098532>>రాసిన <<>>‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పై అధికార, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఈ బుక్ ఏకంగా పార్లమెంట్ సమావేశాలనే స్తంభింపజేసింది. ఒకరోజు PM సభకు రాకుండా చేసింది. ఈ వివాదం LS స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానానికి దారితీసింది. ఈ ప్రక్రియ ముగిసేవరకు సభకు రావద్దని తాజాగా ఆయన నిర్ణయించుకున్నారు.

News February 10, 2026

RTCలో 7,673 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు

image

AP: RTCలో 7,673 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. సచివాలయంలో ఇవాళ మంత్రి సమీక్ష నిర్వహించారు. 2028లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ కానున్నారని, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్ తదితర పోస్టులకు ప్రాధాన్యతతో భర్తీ చేయాలని ఆయన సూచించారు. 2025-26 DPC కింద అర్హులైన 7,514 మంది ఉద్యోగులకు ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

News February 10, 2026

వాషింగ్ మెషీన్ వాడుతున్నారా?

image

ప్రస్తుతకాలంలో వాషింగ్ మెషీన్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అయితే దీన్ని ఉపయోగించడంలో కొన్ని టిప్స్ పాటిస్తేనే దుస్తులు, మెషీన్ మన్నిక బావుంటుంది. * గట్టి, సున్నితమైన వస్తువుల్ని విడిగా జిప్‌లాక్‌ బ్యాగ్‌లో వేసి ఉతకాలి. * క్విక్‌ వాష్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే వాటి నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. * గాఢత తక్కువగా ఉండే డిటర్జెంట్‌ వాడటం మంచిది. * అయితే వేటిని ఉతకాలన్నా వాషింగ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ బట్టి ఉతకాలి.