News February 6, 2025
విదేశీ పోర్న్ సైట్లలో మస్తాన్ వీడియోలు.. రూ.లక్షల్లో సంపాదన
TG: అమ్మాయిలతో మస్తాన్ సాయి అభ్యంతరకర వీడియోల కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. అతను వందలాది వీడియోలను విదేశీ పోర్న్ సైట్లలో అప్లోడ్ చేసి రూ.లక్షలు ఆర్జించేవాడని వెల్లడైంది. పార్టీల పేరుతో అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి ప్రైవేట్ వీడియోలు తీసి బెదిరించేవాడని లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా నిన్న పోలీసులు డ్రగ్స్ టెస్టు చేయగా అతనికి పాజిటివ్ వచ్చింది.
Similar News
News February 6, 2025
కాంగ్రెస్ అహంకారంతో INDIAకు ఓటములు: SP
ఇండియా కూటమిలో మళ్లీ ముసలం పుట్టింది. కాంగ్రెస్ పార్టీ అహంకారం వల్లే ఓటములు ఎదురవుతున్నాయని SP స్పష్టంచేసింది. ఢిల్లీలో Exitpolls ఆప్ ఓటమిని అంచనా వేయడంతో రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టింది. కాంగ్రెస్ అక్కడ బీజేపీ B టీమ్లా పనిచేసిందని SP MP రామ్గోపాల్ అన్నారు. రాహుల్, ఖర్గే, వాద్రా BJP భాషలో మాట్లాడారని, ఆప్ పతనానికి ప్రయత్నించారని విమర్శించారు. అహంకారం వల్లే HAR, MHలో ఓడిపోయారన్నారు.
News February 6, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.250 పెరిగి రూ.79,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.270 పెరగడంతో రూ.86,510 పలుకుతోంది. కాగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. వివాహాలు ఉండటంతో కొనుగోలుదారులకు ఇది మరింత భారం కానుంది.
News February 6, 2025
‘లైగర్’లో నటించేందుకు అనన్య ఒప్పుకోలేదు: చంకీ పాండే
విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాలో నటించేందుకు తన కూతురు అనన్య పాండే అసౌకర్యంగా ఫీలైనట్లు ఆమె తండ్రి చంకీ పాండే తెలిపారు. ఆ పాత్రకు ఆమె వయసు సరిపోదని చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే తానే ఒప్పించినట్లు వెల్లడించారు. కాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘లైగర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఈ సినిమాకు కరణ్ జోహర్ ఓ నిర్మాతగా వ్యవహరించారు.