News May 14, 2024
ఢిల్లీతో మ్యాచ్.. LSG టార్గెట్ 209 రన్స్

LSGతో మ్యాచ్‌లో DC 20 ఓవర్లలో 208/4 స్కోరు చేసింది. అభిషేక్ పోరెల్ 58, షై హోప్ 38, పంత్ 33 పరుగులతో రాణించారు. చివర్లో స్టబ్స్ 25 బంతుల్లో 57* పరుగులతో అదరగొట్టారు. నవీన్ ఉల్ హక్ 2, రవి బిష్ణోయ్, అర్షద్ ఖాన్ చెరో వికెట్ తీశారు.
Similar News
News March 8, 2026
ఫైనల్ మ్యాచ్ క్రేజ్.. ధరలు భారీగా పెంచేశారు!

భారత్, NZ మధ్య నేడు T20WC ఫైనల్ జరగనున్న నేపథ్యంలో అహ్మదాబాద్‌లో హోటల్ రూముల ధరలు కొండెక్కాయి. లగ్జరీని బట్టి ఒక్క రాత్రి బసకు రూ.18 వేల నుంచి రూ.80వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక పలు ఎయిర్‌లైన్స్ ప్రధాన నగరాల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక సర్వీసులు నడుపుతుండగా వాటి ధరలకూ రెక్కలొచ్చాయి. ఇక స్టేడియంలోని లక్షా 30వేల టికెట్లు అమ్ముడుపోగా, 15వేల మంది పోలీసులు స్టేడియం వద్ద భద్రత కల్పిస్తున్నారు.
News March 8, 2026
KCR ఫొటో లేకుండానే రాజకీయాలు: కవిత

TG: మరో రెండుమూడు నెలల్లో పార్టీ పెట్టనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. BRSలోకి మళ్లీ వెళ్లేది లేదని స్పష్టం చేశారు. KCR ఫొటో లేకుండానే రాజకీయాలు చేస్తామని ఆమె ప్రకటించారు. తన వల్లే బీఆర్ఎస్ ఓడిందనే ఆరోపణలపైనా ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తాను జైలుకెళ్లాక పార్లమెంట్ ఎన్నికల్లో BRS ఓడిపోవడం నిజమైతే.. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడారని ప్రశ్నించారు.
News March 8, 2026
కేజీ చికెన్ ధర ఎంత ఉందంటే?

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు ₹300కు చేరాయి. హైదరాబాద్‌లో కేజీ స్కిన్‌లెస్ ₹290-300, ఆసిఫాబాద్‌లో ₹300, వరంగల్‌లో ₹290, కామారెడ్డిలో ₹280-300 పలుకుతోంది. ఏపీలోని విజయవాడలో ₹300గా ఉంది. మరోవైపు గుడ్ల రేట్లు మాత్రం భారీగా తగ్గాయి. 30 గుడ్లు ఉండే ట్రే ధర ₹130-140కి పడిపోయింది. ఇక మటన్ కేజీ ₹800-1000గా ఉంది. మరి మీ ఏరియాలో చికెన్ రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.


