News October 5, 2025
భారత్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్థాన్

మహిళల క్రికెట్ WCలో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఇండియా: ప్రతికా, స్మృతి మంధాన, హర్లిన్, హర్మన్(C), రోడ్రిగ్స్, దీప్తీ శర్మ, రిచా ఘోష్, స్నేహ్ రాణా, రేణుక, క్రాంతి, శ్రీ చరణి
పాక్: మునీబా, సాదక్, సిద్రా అమిన్, రమీన్, అలియా, నవాజ్, ఫాతిమా(C), నటాలియా, డయానా, నష్రా, సదియా
Similar News
News October 5, 2025
రేపు ఆకాశంలో అద్భుతం

అంతుచిక్కని ఆశ్చర్యాలెన్నో దాగిన నింగిలో సోమవారం ఓ అద్భుతం కన్పించనుంది. 2025లో తొలి సూపర్‌మూన్ OCT 6, 7 రాత్రుల్లో కనువిందు చేయనుంది. భూమి చుట్టూ చందమామ తిరుగుతూ కొన్నిసార్లు దగ్గరికి వస్తుంది. పౌర్ణమి రోజు కన్పించే చంద్రుడి కంటే ఈ సమయంలో మూన్ సైజు, వెలుగు ఎక్కువ. రేపు 14% సైజు, 30% వెలుగు అధికంగా ఉండే జాబిలిని సాధారణంగా చూడవచ్చు. ఈ ఏడాదిలో 3 సూపర్ మూన్లలో మిగతా 2 NOV, DECలో ఏర్పడతాయి.
News October 5, 2025
‘8’ సంఖ్యతో శ్రీకృష్ణుడి అనుబంధం

‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరీ మంత్రంలో ఉన్న ‘8’ సంఖ్య కృష్ణుడి జీవితంలో అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంది. హరి 8వ అవతారంగా, దేవకీదేవికి 8వ సంతానంగా, ఆమె గర్భాన 8 మాసాలే ఉండి 8వ తిథి(అష్టమి)న కృష్ణుడు జన్మిస్తాడు. ఆయనకు 8 ధర్మపత్నులు. అప్పటివరకు అపశకునంగా భావించిన అష్టమి తిథికి ఆయన జననం గౌరవాన్ని చేకూర్చింది. 8 సంఖ్యకు ఉన్న అపవాదాన్ని తొలగించేందుకే కృష్ణుడు అష్టమిన పుట్టాడని నమ్ముతారు. <<-se>>#Sankhya<<>>
News October 5, 2025
తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి: CBN

AP: శ్రీశైలం ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆలయంలో వసతుల కల్పనపై Dy.CM పవన్ కళ్యాణ్, మంత్రి ఆనం రామనారాయణ, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇతర ప్రముఖ ఆలయాల్లో సౌకర్యాలను పరిశీలించి శ్రీశైలం అభివృద్ధి చేద్దామని సీఎంకు వారు సూచించినట్లు తెలుస్తోంది. ఆలయ అభివృద్ధికి భూమిని కేటాయించేలా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.