News June 7, 2024
పాక్‌తో మ్యాచ్ చరిత్ర అవుతుంది: హార్దిక్ పాండ్య

T20WCలో ఎల్లుండి పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్ తనకు మరింత స్పెషల్‌గా ఉంటుందని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వెల్లడించారు. ఇది పోరాటం కాదు.. చరిత్ర అవుతుందని పేర్కొన్నారు. ‘పాక్‌తో పోరు ఎప్పుడూ భావోద్వేగంతో ఉంటుంది. ఆనందం, బాధ, ఆందోళన అన్నింటినీ అభిమానులు, ఆటగాళ్లు అనుభవిస్తారు. కచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. హార్దిక్ పాక్‌పై 6 మ్యాచ్‌లలో 84 రన్స్, 11 వికెట్లు పడగొట్టారు.
Similar News
News December 9, 2025
ఇవాళ సాయంత్రం 6 గంటల వరకే..

TG: సర్పంచ్ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్‌కు గడువు సమీపించింది. నేటితో 4,236 స్థానాల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి అవకాశం ఉంది. అటు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నేటి నుంచి ఎల్లుండి వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తొలి విడత పోలింగ్ సాగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు.
News December 9, 2025
పేరెంట్స్‌కు పిల్లలకు మధ్య న్యూరో సింక్రోని

తల్లిదండ్రులు పిల్లలకు మధ్య ఉండే న్యూరో సింక్రోని వల్లే పిల్లల్లో భాష, జీవన నైపుణ్యాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. భావోద్వేగ నియంత్రణకు, ప్రేమ, అనుబంధాల ప్రేరణకు న్యూరో సింక్రోని కీ రోల్ పోషిస్తుంది. అలాగే అమ్మ మాట, పాట వంటివి పిల్లలల్లో నాణ్యమైన నిద్రకు కారణం అవుతాయి. పేరెంట్స్ కారణంగా తాను సురక్షితంగా ఉన్నాను అనే భావనను న్యూరో సింక్రోని పెంపొందిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
News December 9, 2025
ముగిసిన ‘అఖండ-2’ వివాదం!

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. నిన్న రాత్రి ఈరోస్ సంస్థతో 14 రీల్స్‌కు సానుకూల చర్చలు జరిగాయని తెలిపాయి. ఇవాళ కోర్టు విచారణలో ఇదే విషయాన్ని తెలియజేసి విడుదలకు అనుమతులు తీసుకుంటుందని వెల్లడించాయి. ఈ క్రమంలో 12న విడుదల, 11న ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇవాళ ఉ.10.30కు మద్రాస్ కోర్టులో విచారణ జరగనుంది.


