News March 28, 2025

RCBతో మ్యాచ్.. CSK 26/3

image

RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో CSKకు బిగ్ షాక్ తగిలింది. 4.4 ఓవర్లలో 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రాహుల్ త్రిపాఠి 5, కెప్టెన్ రుతురాజ్ 0, దీపక్ హుడా 4 పరుగులకే ఔటయ్యారు. జోస్ హేజిల్‌వుడ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కూల్చేశారు. భువనేశ్వర్ ఒక వికెట్ తీశారు. క్రీజులో రచిన్ 16, కర్రన్ 0 ఉన్నారు.

Similar News

News September 18, 2025

జగన్ అసెంబ్లీకి వస్తారా?

image

AP: నేటి నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ చీఫ్ జగన్ హాజరవుతారా అనేదానిపై సస్పెన్స్ నెలకొంది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన కోరుతుండగా కూటమి ప్రభుత్వం మాత్రం అర్హత లేదని చెబుతోంది. అటు అసెంబ్లీకి వెళ్లొద్దని YCP ఎమ్మెల్యేలను జగన్ ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఎప్పటిలాగే పార్టీ నుంచి మండలి సభ్యులే హాజరవుతారని తెలుస్తోంది. దీనిపై మరికాసేపట్లో క్లారిటీ రానుంది.

News September 18, 2025

‘మార్కో’ సీక్వెల్‌‌‌కు ఉన్ని ముకుందన్ దూరం!

image

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘మార్కో’కు సీక్వెల్ రానుంది. ‘లార్డ్ మార్కో’గా రానున్న ఈ చిత్రంలో హీరోగా ఉన్ని ముకుందన్ నటించట్లేదని సినీ వర్గాలు తెలిపాయి. వేరే హీరోతో ఈ మూవీని తెరకెక్కిస్తారని పేర్కొన్నాయి. ‘మార్కో’పై వచ్చిన నెగిటివిటీ కారణంగా పార్ట్-2 చేసేందుకు ఆసక్తి లేదని గతంలోనే ఉన్ని తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రధాని మోదీ బయోపిక్ ‘మా వందే’లో లీడ్ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

News September 18, 2025

చేతిలో బిట్ కాయిన్‌తో ట్రంప్ విగ్రహం

image

క్రిప్టో కరెన్సీకి మద్దతిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌ విగ్రహాన్ని ఇన్వెస్టర్లు ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ DCలోని యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ బయట 12 అడుగుల ట్రంప్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చేతిలో బిట్ కాయిన్‌తో బంగారు వర్ణంలో ఈ విగ్రహం ఉంది. దీన్ని వెండి, అల్యూమినియంతో తయారు చేసి, బంగారు పూత వేసినట్లు తెలుస్తోంది. ఫెడరల్ రిజర్వు వడ్డీ <<17745765>>రేట్లు<<>> తగ్గించిన కాసేపటికే దీన్ని ఆవిష్కరించారు.