News October 5, 2025

టీమ్‌ఇండియాతో మ్యాచ్.. పాక్ టార్గెట్ ఎంతంటే?

image

మహిళల WCలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో టీమ్‌ఇండియా 247 పరుగులకు ఆలౌటైంది. భారత ఓపెనర్లు ప్రతికా(31), మంధాన(23) త్వరగానే ఔటయ్యారు. హర్లిన్(46) ఇన్నింగ్సును చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఆమెకు తోడ్పాటు కరవైంది. చివర్లో రిచా(35) ఫర్వాలేదనిపించడంతో 247 పరుగులు చేసింది. పాకిస్థాన్ టార్గెట్ 248. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు?

Similar News

News October 5, 2025

శబరి బ్లాకులో లాయర్లతో TPCC నేతల భేటీ

image

కాసేపటి క్రితం ఢిల్లీకి చేరిన TPCC ముఖ్య నేతలు తెలంగాణ భవన్ శబరి బ్లాకులో తమ లాయర్లతో భేటీ అయ్యారు. BCలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున వాదనలు, GO నిలబడేందుకు గల అవకాశాలపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీహరి, BC సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, TPCC చీఫ్ మహేశ్ చర్చిస్తున్నారు.

News October 5, 2025

త్వరలో కురుపాం గురుకులం వెళ్తా: పవన్

image

AP: అనారోగ్యంతో కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మరణించడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితిపై జిల్లా అధికారులు, వైద్యుల నుంచి వివరాలు తీసుకున్నట్లు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకొంటుందన్నారు. త్వరలో కురుపాం వెళ్లి గురుకులంలో పరిస్థితిని పరిశీలిస్తానని పేర్కొన్నారు.

News October 5, 2025

పోలింగ్‌లో 17 మార్పులు.. బిహార్‌లో స్టార్ట్ (1/3)

image

1. ఓటరుగా రిజిస్టరైన 15 రోజుల్లో ఓటర్ కార్డు డెలివరీ
2. పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్లు
3. ప్రతి బూత్‌లో ఓటర్ల సంఖ్య 1500 నుంచి 1200కు తగ్గింపు
4. EVMలపై అభ్యర్థి కలర్ ఫొటో, పెద్ద సైజులో అక్షరాలు
5. బూత్ అధికారి అధికారిక ID కార్డుతో ఉంటారు
6. ప్రతి బూత్‌లో 100% వెబ్ కాస్టింగ్
7. బూత్ లెవల్ ఏజెంట్లు అందరికీ ట్రైనింగ్
8. బూత్ ఓట్ల లెక్కింపులో తేడాలుంటే అక్కడి VVPATలు కూడా లెక్కిస్తారు