News May 22, 2024
కాసేపట్లో మ్యాచ్.. కోహ్లీ భద్రతకు ముప్పు!

అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో కాసేపట్లో RCBvsRR మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. అయితే కోహ్లీకి ముప్పు ఉండటంతో స్టేడియం వద్ద భద్రతను పెంచారు. నిన్న RCB ప్రాక్టీస్ సెషన్‌ను కూడా రద్దు చేసినట్లు సమాచారం. మొన్న అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ISIS ఉగ్రవాదులు పట్టుబడటంతో కోహ్లీ భద్రతకు ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. స్టేడియానికి 5వేల మంది పోలీసులు, వెయ్యి మంది ప్రైవేట్ సెక్యూరిటీతో భద్రత కల్పిస్తున్నారు.
Similar News
News February 15, 2026
స్టార్ యాక్టర్ నన్ను మోసం చేశాడు: మమతా మోహన్‌దాస్

తాను క్యాన్సర్, బొల్లి సమస్యలతో బాధపడుతున్నప్పుడే ప్రేమ, పెళ్లి విషయంలో ఎంతో మానసిక వేదన అనుభవించానని హీరోయిన్ <<10013472>>మమతా మోహన్‌దాస్<<>> తెలిపారు. ‘ఆ టైంలో ఓ ప్రముఖ మలయాళ నటుడితో డేటింగ్ చేశా. అయితే అతనికి అప్పటికే వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ అయిన విషయాన్ని దాచి మోసం చేశాడు’ అని ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈమె 2011లో ప్రజిత్‌ను పెళ్లి చేసుకోగా 6 నెలలకే విడిపోయారు.
News February 15, 2026
తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

తూర్పుగోదావరి జిల్లాలోని స్పెషల్ జ్యుడిషీయల్ సెకండ్ క్లాస్ కోర్టుల్లో 6 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. కోర్టు అసిస్టెంట్స్, కోర్టు అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, 7వ తరగతి, పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://eastgodavari.dcourts.gov.in
News February 15, 2026
అనుకోకుండా జాగరణ చేసినందుకే!

గుణనిధి కథ మహాశివరాత్రి ఉపవాసం, జాగరణల విశిష్టతను తెలుపుతుంది. దురలవాట్లు గల గుణనిధి ఓ శివరాత్రి నాడు ఆహారం దొరకక అనివార్యంగా ఉపవాసం ఉన్నాడు. ప్రసాదం కోసం శివాలయానికి వెళ్తే అక్కడ అందరూ జాగారణ చేస్తూ కనిపించారు. దీంతో గుణనిధి కూడా జాగరణ చేస్తాడు. చివరకు ఆలయంలోనే మరణిస్తాడు. కానీ, తెలియకుండానే ఉపవాసం ఉండి జాగరణ చేయడంతో పాపాలు నశించాయి. మరుసటి జన్మలో నిధుల అధిపతి కుబేరుడిగా జన్మించాడు.


