News October 19, 2024

వర్షంతో నిలిచిన మ్యాచ్

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు వర్షం కారణంగా నిలిచిపోయింది. నాలుగో రోజు తొలి సెషన్‌లో భారత బ్యాటర్ సర్ఫరాజ్(125) సెంచరీ చేయగా, పంత్(53) అర్ధసెంచరీతో క్రీజులో ఉన్నారు. భారత స్కోరు 344/3.

Similar News

News October 19, 2024

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే నిజమైన దోస్తాన్: బండి సంజయ్

image

TG: నిజమైన స్నేహం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటి కాదని నొక్కి చెప్పారు. హరియాణా, J&K ఎన్నికలకు కేసీఆర్ డబ్బులు పంపింది వాస్తవం కాదా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ ఏమైందన్నారు. BRS, కాంగ్రెస్ మధ్య స్నేహం లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

News October 19, 2024

ఒక్క బాంబు బెదిరింపు కాల్‌తో రూ.3 కోట్ల నష్టం

image

బాంబు బెదిరింపు కాల్స్‌తో ఎయిర్‌లైన్స్ కంపెనీల చమురు వదులుతోంది! ఒక్కో నకిలీ కాల్ వల్ల రూ.3 కోట్ల వరకు నష్టపోతున్నట్టు అంచనా. దారి మళ్లిస్తే అదనపు ఫ్యూయల్ కోసం రూ.కోటి వరకు ఖర్చవుతోంది. ఇక ఫ్లైట్ ల్యాండింగ్, ఎయిర్‌పోర్ట్ పర్మిషన్లు, ప్రయాణికులకు లాడ్జింగ్, బోర్డింగ్, ఫుడ్, ఇతర అవసరాలకు మరో రూ.2కోట్లు కావాల్సి వస్తోంది. ఇప్పటి వరకు 40 ఫేక్ కాల్స్ వల్ల కంపెనీలపై రూ.60-80కోట్ల అదనపు భారం పడింది.

News October 19, 2024

ఆర్థిక రాజధానిగా విశాఖ, కర్నూలులో హైకోర్టు బెంచ్: సీఎం చంద్రబాబు

image

AP: రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రాంతం అమరావతి అని, అదే ఏకైక రాజధాని అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని, కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. అమరావతి కోసం 54వేల ఎకరాలు సేకరిస్తే గత ప్రభుత్వం రాజధానిని నాశనం చేసిందని దుయ్యబట్టారు. రైతులను అడుగడుగునా అణగదొక్కినా వాళ్లు అద్భుతంగా పోరాడారని పేర్కొన్నారు.