News December 18, 2024

వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్

image

బ్రిస్బేన్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. ఐదవ రోజు ఆట ఆరంభమైన కాసేపటికే భారత్ <<14910004>>ఆలౌటైంది<<>>. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే సమయానికి ఆకాశం మేఘావృతమై ఉరుములు రావడంతో అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ వర్షం కురుస్తోందని, ఇవాళ వాతావరణం మ్యాచుకు అనుకూలించేలా లేదని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.

Similar News

News January 31, 2026

ఢిల్లీ హైకోర్టులో 152 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>ఢిల్లీ <<>>హైకోర్టులో 152 జూనియర్ జ్యుడీషియల్ అసిస్టెంట్/రోస్టరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హత గలవారు FEB 4 – 23 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 32ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రిలిమ్స్, మెయిన్ (డిస్క్రిప్టివ్) పరీక్ష, టైప్ టెస్ట్ (నిమిషానికి 35వర్డ్స్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://delhihighcourt.nic.in

News January 31, 2026

మొక్కజొన్నలో జింక్ లోపం – నివారణ

image

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, మోతాదుకు మించి భాస్వరం ఎరువులను వాడినప్పుడు, అధిక నీటి ముంపునకు గురైనప్పుడు మొక్కజొన్నలో జింక్ లోపం కనబడుతుంది. దీని వల్ల ఆకుల, ఈనె మధ్య భాగాలు పాలిపోయిన పసుపు, తెలుపు రంగుగా మారతాయి. పంట ఎదుగుదల ఆశించినంతగా ఉండదు. జింక్ లోపం నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్‌ను కలిపి 4-5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

News January 31, 2026

స్పటిక మాలను ఎందుకు ధరించాలి?

image

స్పటిక మాలను ధరిస్తే మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం.. ఇది శుక్ర గ్రహాన్ని బలపరిచి సంపద, కీర్తి, ఆకర్షణను ప్రసాదిస్తుంది. లక్ష్మీ దేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు తొలగి శ్రేయస్సు సిద్ధిస్తుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గించి మనస్సును చల్లబరుస్తుంది. మనస్సును నిగ్రహించుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. క్రమం తప్పకుండా నియమాలు పాటిస్తూ ధరిస్తే సానుకూల శక్తి పెరుగుతుంది.