News October 20, 2024
మ్యాచ్ టై.. సూపర్ ఓవర్లో గెలిచిన నేపాల్

నేపాల్, యూఎస్ఏ మధ్య జరిగిన రెండో టీ20 ఊహించని మలుపులు తిరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. ఛేదనలో యూఎస్ఏ 170 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో సూపర్ ఓవర్లో USA 2 పరుగులు చేయగా నేపాల్ నాలుగు బంతుల్లోనే విజయాన్ని సొంతం చేసుకుంది.
Similar News
News January 17, 2026
ప్రేమను పెంచే సింపుల్ ట్రిక్!

దంపతుల మధ్య చిలిపి తగాదాలు, ఒకరినొకరు ఆటపట్టించుకోవడం వల్ల వారి బంధం మరింత బలపడుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి సరదా టీజింగ్స్.. భాగస్వాముల మధ్య ఉన్న భయాన్ని పోగొట్టి, చనువును పెంచుతుంది. ఒకరిపై ఒకరు జోకులు వేసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, గొడవలను కూడా నవ్వుతూ పరిష్కరించుకోవచ్చు. అయితే ఈ హాస్యం కేవలం ఆనందం కోసమే ఉండాలి తప్ప, అవతలి వ్యక్తిని కించపరిచేలా ఉండకూడదు. share it
News January 17, 2026
నితీశ్ రెడ్డి ఆల్‌రౌండర్ కాదు: కైఫ్

NZతో ODI సిరీస్‌లో IND పిచ్‌కి తగ్గట్టు ప్లేయింగ్-11ని ఎంపిక చేయట్లేదని మాజీ క్రికెటర్ కైఫ్ అన్నారు. జట్టులో నితీశ్ రోల్ ఏంటో అర్థం కావడం లేదని తన YouTube వీడియోలో చెప్పుకొచ్చారు. ‘నితీశ్ ఆల్‌రౌండర్ కాదు. అతను బ్యాటర్ మాత్రమే. ఈ విషయాన్ని మేనేజ్మెంట్ వీలైనంత త్వరగా అర్థం చేసుకోవాలి. అతడిని బ్యాటర్‌గా డెవలప్ చేయాలి. పార్ట్ టైమ్ బౌలర్‌ను ఆల్‌రౌండర్ అనడం కరెక్ట్ కాదు’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
News January 17, 2026
రానున్న 5 రోజులు వర్షాలు

TG: రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షసూచన చేసింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 21 వరకు అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఆస్కారముందని పేర్కొంది. అటు రాష్ట్రంలో నిన్నటి వరకు చలి తీవ్రత తగ్గినట్లు కనిపించగా ఇవాళ పెరిగింది. మరోవైపు ఫిబ్రవరి తొలి వారం నుంచి ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.


