News December 4, 2024
పాకిస్థాన్‌తో మ్యాచ్.. భారత్‌కు ALL THE BEST

మెన్స్ జూనియర్ ఆసియా కప్ హాకీ మ్యాచ్‌లో భారత్-పాకిస్థాన్ ఇవాళ తలపడనున్నాయి. మలేషియాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో 3-1తేడాతో గెలవడంతో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇవాళ రాత్రి 8.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో పాక్‌తో అమీతుమీ తేల్చుకోనున్న భారత జట్టుకు ఫ్యాన్స్ ALL THE BEST చెబుతున్నారు.
Similar News
News February 13, 2026
సివిల్స్‌లో 2,834 ఉద్యోగ ఖాళీలు: జితేంద్ర సింగ్

దేశంలోని 3 సివిల్ సర్వీసెస్‌లో 2,834 ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో వెల్లడించారు. 2025 జనవరి 1 నాటికి 1,300 ఐఏఎస్, 1,029 ఐఎఫ్ఎస్, 505 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ మూడు సర్వీసులకు కేంద్ర ప్రభుత్వం 15,169 పోస్టులను అనుమతించగా 12,335 ఖాళీలను భర్తీ చేసినట్లు పేర్కొన్నారు.
News February 13, 2026
ఎన్నికల సిబ్బందిపై దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు: డీజీపీ

TG: ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులపై దౌర్జన్యాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని DGP శివధర్ రెడ్డి హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు, కార్యకర్తలు.. ఇలా ఎవరైనా చట్టానికి అతీతులు కారన్నారు. సిబ్బంది పొరపాట్లు చేస్తే SECకి లేదా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇప్పటికే పోలీసులు, ఉద్యోగుల మీద చేసిన దౌర్జన్యాలపై నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలని SPలను ఆదేశించారు.
News February 13, 2026
పాకిస్థాన్‌తో మ్యాచ్.. అభిషేక్ ఆడే ఛాన్సుందన్న వరుణ్

T20 WC: పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడేందుకు అభిషేక్ శర్మ అందుబాటులో ఉండే ఛాన్స్ ఉందని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నిన్న మ్యాచ్ అనంతరం చెప్పారు. అభి బాగానే కనిపించాడని, ప్రాక్టీస్ కూడా చేశాడని తెలిపారు. మరోవైపు అభిషేక్ ఒకటి లేదా రెండు మ్యాచులకు అందుబాటులో <<19122478>>ఉండకపోవచ్చని<<>> నిన్న మ్యాచుకు ముందు కెప్టెన్ సూర్య పేర్కొన్నారు. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. కాగా ఫిబ్రవరి 15న భారత్-పాక్ తలపడనున్నాయి.


