News August 21, 2025

పాక్‌తో మ్యాచ్.. BCCIపై ఫ్యాన్స్ ఫైర్

image

ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచులు ఖరారైనట్లే. <<17474721>>క్రీడాశాఖ<<>> కూడా పరోక్షంగా ఒప్పుకుంది. దీంతో BCCIపై SMలో విమర్శలొస్తున్నాయి. ‘BCCIకి జవాన్ల త్యాగాలు, మన మనోభావాలతో పనిలేదు. డబ్బులొస్తే చాలు. అమరవీరుల సమాధులపై మీరు క్రికెట్ ఆడతామంటున్నారు. నీళ్లు-రక్తం కలిసి ప్రవహించలేవు. కానీ BCCI కోసం రక్తం-డబ్బు కలిసి ప్రవహిస్తాయి. మీరు డబ్బుకోసం పాక్‌తో ఆడినా.. మేము ఆ మ్యాచులు చూడం’ అంటూ పోస్టులు పెడుతున్నారు.

Similar News

News August 21, 2025

ఏపీఎం టెర్మినల్స్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం

image

AP: పోర్టుల అభివృద్ధి, సౌకర్యాలపై APM టెర్మినల్స్ సంస్థతో CM చంద్రబాబు సమక్షంలో ఏపీ మారిటైం బోర్డు ఒప్పందం చేసుకుంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో ₹9వేల కోట్లతో టెర్మినల్స్, కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. దీని వల్ల దాదాపు 10,000 మందికి ఉపాధి లభించనుంది. APని తూర్పు దేశాలకు సముద్ర ద్వారంగా, లాజిస్టిక్స్ హబ్‌గా మార్చడానికి కట్టుబడినట్లు CM పేర్కొన్నారు.

News August 21, 2025

వివాదానికి శుభం కార్డు.. రేపటి నుంచి షూటింగ్‌లు షురూ!

image

ప్రభుత్వ జోక్యంతో టాలీవుడ్ <<17429585>>ప్రొడ్యూసర్లు-ఫెడరేషన్<<>> మధ్య వివాదం సద్దుమణిగింది. దీంతో 18 రోజుల విరామం తర్వాత రేపటి నుంచి సినిమా షూటింగ్‌లు ప్రారంభం కానున్నాయి. కండీషన్లు, డిమాండ్లపై కాసేపట్లో ప్రకటన విడుదల కానుంది. ప్రభుత్వ జోక్యంతో లేబర్ కమిషన్ రంగంలోకి దిగి చర్చలు జరిపింది.

News August 21, 2025

రేపు ఫలితాలు విడుదల

image

AP: రేపు DSC మెరిట్ <<17459141>>లిస్ట్ <<>>విడుదల చేయనున్నట్లు కన్వీనర్ కృష్ణారెడ్డి వెల్లడించారు. DSC సైటుతో పాటు జిల్లా విద్యాధికారి సైటులోనూ ఫలితాలు చూసుకోవచ్చన్నారు. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో వివిధ కేటగిరీల పోస్టుల కాల్ లెటర్ పొందవచ్చని సూచించారు. లిస్టులో ఉన్న వారంతా ఒరిజినల్ సర్టిఫికెట్లు, గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన 3 సెట్ల జిరాక్సులు, 5 పాస్ పోర్టు ఫొటోలతో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని తెలిపారు.