News September 11, 2025
పాక్‌తో మ్యాచ్.. ఆసక్తి చూపని IND ఫ్యాన్స్?

INDvsPAK మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. మ్యాచ్ ఎక్కడ జరిగినా క్షణాల్లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యేవి. అయితే UAEలో జరుగుతోన్న ఆసియా కప్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఈనెల 14న జరిగే దాయాదుల మ్యాచ్‌పై భారతీయులు ఆసక్తి చూపించట్లేదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. మ్యాచుకు మరో 2 రోజులే ఉన్నా టికెట్స్ ఇంకా సేల్ అవలేదట. పహల్గామ్ అటాక్ కారణంగా PAKతో మ్యాచ్‌పై భారతీయులు ఆసక్తిగా లేరని అంటున్నాయి.
Similar News
News September 11, 2025
లిక్కర్ స్కాం కేసులో సిట్ సోదాలు

AP: లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తును సిట్ ముమ్మరం చేసింది. హైదరాబాద్, విశాఖలో నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన కంపెనీల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్-3లోని స్నేహ హౌస్, రోడ్ నంబర్-2లోని సాగర్ సొసైటీ, కాటేదాన్-రాజేంద్రనగర్, ఖైరతాబాద్-కమలాపురి కాలనీలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విశాఖలోని వాల్తేర్ రోడ్-వెస్ట్ వింగ్‌లో ఉన్న మరో కార్యాలయంలోనూ రైడ్ జరుగుతోంది.
News September 11, 2025
ఈ సాయంత్రం ఢిల్లీకి సీఎం

AP: సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం ఢిల్లీలో జరిగే ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. శుక్రవారం ఉ.9.30 గం.కు రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం సాయంత్రం అమరావతికి తిరిగి రానున్నారు.
News September 11, 2025
NCLTలో 32 పోస్టులు

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(<